దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈరోజు ఇప్పటి వరకు దేశంలో కొత్తగా 15 కేసులు నమోదయ్యాయి. అంతేకాదు, ఒమిక్రాన్ వేరియంట్‌లో మరణాల రేటు తక్కువగానే ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్న సమయంలోనే బ్రిటన్‌లో ఒమిక్రాన్ మరణాల సంఖ్య పెరిగిపోతున్నది. ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతున్నది. దీంతో ప్రపంచదేశాలన్నీ అప్రమత్తం అయ్యాయి. భారత ప్రభుత్వం ఇప్పటికే దీనిపై రాష్ట్రాలను హెచ్చరించింది.
Read: టెస్లా కారుపై ఆగ్రహం… 30 కేజీల డైనమైట్‌తో…
తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అర్హులైన అందరికీ రెండు డోసుల వ్యాక్సిన్ అందించాలని స్పష్టం చేసింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈరోజు కేంద్రం రాజ్యసభలో ఒమిక్రాన్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. ఒమిక్రాన్‌ను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్రం ప్రకటించింది. పిల్లల వ్యాక్సిన్ కూడా త్వరలోనే వస్తుందని కేంద్రం తెలియజేసింది. ప్రతి ఒక్కరు విధిగా నిబంధనలు పాటించాలని, అప్పుడే మహమ్మారిని తరిమికొట్టవచ్చని కేంద్రం స్పష్టం చేసింది.