దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతూనే వుంది. పెట్రోలియం కంపెనీలు ఏప్రిల్ 4 సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 40 పైసలు పెంచాయి. ఇంధన ధరల తాజా పెరుగుదల తర్వాత, ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.81కి, డీజిల్ లీటరుకు రూ.94.07కి చేరుకుంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 118.81, డీజిల్ రూ. 103.04. చేరుకుంది. గత 14 రోజుల్లో 12వసారి చమురు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. నవంబర్ 4, 2021 నుంచి చమురు ధరలు దేశవ్యాప్తంగా స్థిరీకరించారు. దాదాపు ఒకటిన్నర నెలల తర్వాత అంటే మార్చి 22న మొదటిసారిగా ధరలు పెంచారు.
మార్చి 22 నుంచి ఏప్రిల్ 4 వరకు 14 రోజుల్లో 12 సార్లు చమురు ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారు. గత 14 రోజుల్లో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.8.40 పెరిగింది. మార్చి 21, 2022 వరకు ఢిల్లీలో ఒక లీటర్ పెట్రోల్ ధర లీటరుకు రూ.95.41 ఉండగా ప్రస్తుతం లీటరుకు రూ.103.81కి పెరిగింది. చెన్నైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.109.36, డీజిల్ లీటరుకు రూ.99.44 గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.117.53గా ఉంది.
ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.103.60గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.117.71గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.103.81గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 118.03గా ఉండగా.. డీజిల్ ధర రూ.104.10కి పెరిగింది. హైదరాబాద్ తో పోలిస్తే ఏపీలో చమురు ధరలు ఎక్కువగానే వున్నాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.118.55కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.105.90గా వుంది. ఒకేసారి 5 నుంచి 10 రూపాయలు పెంచకుండా. రోజూ లీటరుకి 40, 50 పైసలు పెంచుతూ తమ స్ట్రాటజీని అమలుచేస్తున్నాయి ఆయిల్ కంపెనీలు.
ఇదిలా వుంటే.. పెట్రో,డీజిల్ ధరలపై ట్విట్టర్లో కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో మేము గత 7 సంవత్సరాలలో (2015 జనవరి) VATని పెంచలేదు. ఇంధన ధరలను కనీసం 30% తగ్గించే ఎన్‌డిఎ ప్రభుత్వం విధించిన విచక్షణారహిత సెస్సులను తొలగించాలన్నది మా డిమాండ్ అన్నారు మంత్రి కేటీఆర్.
చైనీస్ హింస గురించి పుస్తకాలలో మాత్రమే చదవండి!
వరుసగా 14 రోజుల్లో 12 సార్లు పెట్రో ఉత్పత్తుల ధరల పెంపు
అలాంటి హింసను అనేక రకాల రికార్డులను అధిగమించింది
నిర్మలా సీతారామన్ జీ, ముడిచమురు ధరలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పార్లమెంటులో చర్చకు ఎందుకు వెనుకాడుతున్నారు? అంటూ సూటిగా ప్రశ్నించారు కేటీఆర్.

Ktr Tweet