తెలంగాణ రైతాంగం అంత కూడా మోడీ చేస్తున్న చర్యలతో ఆందోళన లో ఉన్నారు. తెలంగాణ రైతులు, ప్రజల పట్ల పూర్తిగా మోడీ వివక్ష చూపుతున్నారు అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. మేము వడ్లు కొనం అంటే ఎం చేస్తారు ? దాన్యం సేకరణ చేయడం కేంద్ర ప్రభుత్వం బాధ్యతనే. వరి ధాన్యంను ఎగుమతి చేసేందుకు వాళ్ళ దగ్గరనే అంతర్జాతీయ పాలసీ ఉంది. ఆహార నిల్వలను ఇతర దేశాలకు పంపించే బాధ్యతమిదేగా అని గుర్తు చేసారు. రైతులతో రాజకీయాలు చేస్తోంది ఈ బీజేపీ పార్టీ అని తెలిపారు.
పార్లమెంట్ లో ఇప్పటికైనా తెలంగాణ రైతుల వడ్లు కొంటాం అని ప్రకటన చేయాలి. బీజేపీ రాష్ట్ర ఎంపీలకు సిగ్గు ఉండాలి …వాళ్ళు అబద్దాల మీదనే బ్రతుకుతున్నారు. కేంద్ర సర్కార్ కు చివరి హెచ్చరిక ద్వారా ఈనెల 20న గ్రామ గ్రామన నిరసనలు ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వాలి. బీజేపీ పార్టీకి గోరి కట్టడం ఖాయం. కేంద్ర ప్రభుత్వం ద్వారా సానుకూల ప్రకటన వచ్చే వరకు మా పోరాటం ఉంటుంది అని పేర్కొన్నారు.