Bandi Sanjay: రాజకీయలబ్ధి కోసమే కేసీఆర్ ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వాణిజ్య, ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మరింత స్ఫష్టత ఇచ్చారు. యాసంగి సీజన్ లోనూ కచ్చితంగా తెలంగాణ నుండి రా రైస్ కొనుగోలు చేస్తామని ప్రకటించారు. రైతులను ఆదుకోవడం తమ కనీస బాధ్యతని పీయూష్ గోయల్ చెప్పారు. దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వమే ఈ విషయంలో కేంద్రానికి సహకరించకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు.
ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు పార్లమెంట్ లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలిశారు. కేంద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనుగోలు చేయకుండా తెలంగాణకు అన్యాయం చేస్తోందంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని బదనాం చేస్తున్న విషయాన్ని వివరించారు.
Also Read
- Harish Rao : జర్మనీ ఉద్యోగాల పేరుతో మోసమా? టామ్కామ్పై హరీష్ రావు ఫైర్
- Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్!
- Harish Rao: రెగ్యులర్ బస్సులు తగ్గించి, స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టడం దుర్మార్గం..
- Rangareddy District: ఎంవీఎస్ఆర్ కాలేజీలో ఘోర ప్రమాదం.. లైటింగ్ స్టాండ్ కూలి విద్యార్థిని మృతి
‘ అసలు రా రైస్ కొనబోమని చెప్పిందెవరు? దేశవ్యాప్తంగా బియ్యం ప్రొక్యూర్ చేస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు ఆపుతాం? పక్కా రా రైస్ కొంటాం. రైతులకు ఇబ్బంది కాకుండా చూడటం మా కనీస బాధ్యత. అసలు గతంలో ఇస్తానన్న బియ్యం ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వనేలేదు. అయినా దేశంలో ఎక్కడా లేని సమస్య తెలంగాణలోనే ఎందుకు వస్తోంది? పార్లమెంట్ సాక్షిగా గతంలోనే టీఆర్ఎస్ లేవనెత్తిన అంశాలన్నింటికీ సమాధానమిచ్చిన. ఇకపై భవిష్యత్తులో తెలంగాణ నుండి బాయిల్డ్ రైస్ పంపబోమని రాష్ట్ర ప్రభుత్వమే సంతం చేసింది కదా.. మళ్లీ వచ్చిన ఇబ్బంది ఏమిటి?’’అని పీయూష్ గోయల్ పేర్కొన్నారు.
సమావేశానంతరం బండి సంజయ్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కేంద్రం రా రైస్ కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారని చెప్పారు. రాజకీయ లబ్ది కోసం కేసీఆర్ ప్రభుత్వం బీజేపీని బదనాం చేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. గతంలోనూ ఇదే అంశంపై కేంద్రాన్ని బదనాం చేసేందుకు పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు, ఢిల్లీకి వచ్చి రాష్ట్ర మంత్రుల బ్రుందం రకరకాల డ్రామాలాడి భంగపడ్డ విషయాన్ని ఈ సందర్భంగా సంజయ్ గుర్తు చేశారు. మళ్లీ యాసంగి పేరుతో టీఆర్ఎస్ కొత్త డ్రామాలకు తెరదీసిందని విమర్శించారు. పసుపు రైతులకు పరిహారంపై కేంద్ర మంత్రితో చర్చించారు ధర్మపురి అరవింద్.
అకాల వర్షాల కారణంగా గతేడాది పసుపు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించే విషయంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఈరోజు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో చర్చించారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు బండి సంజయ్, సోయం బాపూరావులతో కలిసి కేంద్ర మంత్రిని కలిసిన సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అరవింద్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సైతం ఫసల్ బీమా అమలు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన పసుపు రైతులకు పరిహారం అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతిపాదనలు పంపితే… కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Donald Trump: ఫ్రాన్స్‌లో అల్లర్లు.. వలసదారులే కారణమన్న ట్రంప్, ‘సరిహద్దులు మూసేయండి’ అంటూ పిలుపు!
-
Poco X8s: 12GB RAM, Snapdragon 7 Gen 4 ప్రాసెసర్‌తో Poco X8s? లీకైన వివరాలు ఇవే!
-
Kiren Rijiju: ‘‘బంగ్లాదేశ్-ఫ్రాన్స్ తరహాలో భారత్‌లో కుట్ర’’.. సోరోస్ ప్లాన్ పనిచేయదన్న కిరెన్ రిజిజు..
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
Kilauea volcano: 55వ సారి కిలావుయా అగ్ని పర్వత విస్పోటనం..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్‌లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!