స్క్రాప్‌ల విక్రయం ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. గత కొన్నేళ్లుగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గత 3 ఏళ్లలో స్క్రాప్‌లను విక్రయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ. 2,364 కోట్లను ఆర్జించినట్లు పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం (DPIIT) తెలియజేసింది. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో వెలువడిన వ్యర్థాలు విక్రయించారు.
Kishan Reddy : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం అధికారులు కృషి చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దిశా కమిటీ సమావేశం అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మైనారిటీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టళ్లు మంజూరు చేస్తే అనేక రాష్ట్రాల్లో సరైన రీతిలో అమలు కావడం లేదని, అంగన్ వాడీ స్కూళ్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల నిర్మాణానికి భూమి కొరత నెలకొందన్నారు కిషన్ రెడ్డి. నగరంలో…
Kishan Reddy : కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఒక్క ఉద్యోగం కూడా ఖాళీగా ఉండకుండా భర్తీ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారు అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రకటించారు. రోజ్ గార్ మేళా ద్వారా ఇప్పటి వరకు 8.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ఆయన వెల్లడించారు. సోమవారం బషీర్ బాగ్‌లో భారతీయ విద్యా భవన్‌లో జరిగిన రోజ్‌గార్ మేళాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా…
భారత ప్రభుత్వం జనాభా గణనను నిర్వహించడానికి పూర్తి సన్నాహాలు చేసింది. వచ్చే ఏడాది నుంచి జనాభా గణన ప్రారంభించి ఏడాదిలోగా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ జనాభా గణన డేటా 2026లో మాత్రమే పబ్లిక్ చేయబడుతుంది. ఈ జనాభా గణన 2021లోనే ప్రారంభం కావాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా పడింది.
High Court Questioned Central Government: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డీప్‌ఫేక్ టెక్నాలజీని నియంత్రించేందుకు ఏం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సంబంధించి మూడు వారాల్లోగా స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ నవంబర్ 21న జరగనుంది. డీప్‌ఫేక్‌ల ద్వారా వీడియోలు సృష్టించి అప్‌లోడ్ చేస్తున్నారని, వాటి ద్వారా వ్యక్తుల గురించి తప్పుడు సమాచారాన్ని అప్‌లోడ్ చేస్తున్నారని కోర్టు…
దీపావళికి ముందే కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులకు భారీ కానుకను అందించింది. తాజా నివేదిక ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ (డిఎ పెంపు)లో 3 శాతం పెంపును ప్రకటించింది.
Eatala Rajendar: తాజాగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించి పలు వ్యాఖ్యలు చేసారు. ఇందులో భాగంగా.. రీజనల్ రింగ్ రోడ్డు ప్రపోజల్ ఉన్న ప్రాంతాల్లో రైతులు, ప్రజలు ఆందోళన పడుతున్నారని, తమ పొలాలకు, స్థలాలకు వచ్చే నష్ట పరిహారం విషయంలో బాధపడుతున్నారని, రీజనల్ రింగ్ రోడ్డు బాదితుల సమస్యలను కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ దృష్టికి తీసుకవెళ్ళామని ఆయన తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డుపై…
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. రెండు రాష్ట్రాల్లో రోడ్ల అభివృద్ధి కోసం నిధులు కేటాయించింది కేంద్రం.. అందులో ఆంధ్రప్రదేశ్‌కు 498 కోట్ల రూపాయలు కేటాయించగా.. తెలంగాణకి 516 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది.
కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు తీసుకుంది. రైతుల ఆదాయం పెంచేందుకు, ఫుడ్ సెక్యూరిటీ కోసం పీఎం రాష్ట్ర వికాస్ యోజన తోపాటు కృషోన్నతి యోజన కోసం రూ.1,01,321 కోట్ల రూపాయలకు ఆమోదం తెలిపింది.