విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందని ప్రధాని మోడీ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్‌కు ముందు ముందు మంచి కాలం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖ స్టీల్ ఫ్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది.
విశాఖ ఉక్కుపై కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఫ్యాక్టరీకి కేంద్రం కొత్త జీవం పోసింది. పరిశ్రమ అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం భారీ ప్యాకేజీ ప్రకటించింది. రూ.11, 400 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది.
ప్రైడ్ ఆఫ్ స్టీల్ అని గర్వంగా చెప్పుకునే విశాఖ ఉక్కు మనుగడ మీద ముసురుకున్న గాఢ మేఘాలు తొలిగిపోయాయి. ఎన్నికల హామీకి అనుగుణంగానే NDA ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ మనుగడను కాపాడే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. RINLకు 11500కోట్ల రూపాయల ఆర్ధిక సహాయం అందించేందుకు కేబినెట్ ఆమోదం లభించింది. దీంతో గత నాలుగేళ్ళుగా కార్మిక సంఘాలు సాగిస్తున్న పోరాటం.. రాజకీయ ఒత్తిళ్ళకు ఫలితం లభించినట్టైంది.
నేడు జమిలి ఎన్నికల జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యుల సమావేశం జరుగనుంది. కాసేపట్లో సమావేశం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై విస్తృత చర్చ కోసమే జేపీసీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మోడీ అసాధ్యం అనుకున్న బిల్లును సుసాధ్యం చేసి చూపారన్నారు. దేశంలో వరుస ఎన్నికల వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల నగారా మోగింది. మంగళవారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఫిబ్రవరి 5న ఒకే విడతలో హస్తినలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు విడుదలకానున్నాయి.
దేశాన్ని మరోసారి కొత్త వైరస్ భయపెడుతోంది. చైనాలో ప్రారంభమైన ‘హ్యూమన్ మెటాన్యూమో వైరస్ భారత్లోకి కూడా ప్రవేశించింది. సోమవారం ఆయా రాష్ట్రాల్లో ఆరు కేసులు నమోదైనట్లు నివేదికలు పేర్కొన్నాయి.
DAP Prices: రైతులకు మరోసారి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈసారి డై–అమ్మోనియం ఫాస్ఫేట్ (DAP) ధర జనవరి నుంచి పెరిగే అవకాశం ఉంది. 50 కిలోల బ్యాగ్పై సుమారు 200 రూపాయల వరకు పెరగనుందని సమాచారం.
Komatireddy Venkat Reddy : ఓఆర్ఆర్ అమ్ముకున్న వాళ్ళ పై విచారణ కి అదేశించామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం 7 వేల కోట్లకు అమ్మిందని ఆయన అన్నారు. హరీష్ రావు కి.. మామ మీదనో.. బామ్మర్ది మీదనో కోపం తోటి అసెంబ్లీ లో విచారణ కి డిమాండ్ చేశారన్నారు. సీఎం విచారణకు ఆదేశించారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఈ ఫార్ములా రేసు కేసులో ఒకరో ఇద్దరో జైలుకి పోతారని,…