వన్ నేషన్, వన్ ఎలక్షన్‌కి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టనున్నారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే దిశగా కేంద్ర మంత్రివర్గం ఈరోజు భేటీ అయింది.
గృహిణిలకు కేంద్రం శుభవార్త చెప్పింది. వంట నూనెల ధరలు పెరుగుతాయంటూ ఇటీవల వార్తలు హల్‌చల్ చేశాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో నూనెల ధరలు పెరుగుతాయంటూ వచ్చిన వార్తలతో భయాందోళన చెందారు.
Cooking Oil: మధ్య తరగతి ప్రజలపై మరో పిడుగు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అయింది. వంటింటి ఖర్చు ఇకపై మరింతగా పెరగబోతుంది. ముడి, రిఫైన్డ్ వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్ర సర్కార్ ఒకేసారి 20 శాతం వరకు పెంచడంతో ఆ మేరకు వంటనూనెల రేట్లు పెరగనున్నాయి.
Mpox Cases: భారతదేశంలో తొలిసారి మంకీపాక్స్ అనుమానితుడిని గుర్తించడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాధిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది.
వర్షాలు, వరదలతో భారీ నష్టాన్ని చవి చూసిన తెలుగు రాష్ట్రాలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం భారీ సాయం ప్రకటించినట్టు వార్తలు గుప్పుమన్నాయి.. వరద సాయంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం రూ.3,300 కోట్ల నిధులు విడుదల చేసినట్టు ప్రచారం జరిగింది.. అయితే, ఈ వ్యవహారంలో ఊహించని ట్విస్ట్ వచ్చి చేరింది.. కేంద్రం సాయం చేసింది అనే వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
భారీ వర్షాలు, వరదల కారణంగా అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం ప్రకటించింది. తక్షణ సాయంగా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.3, 300 కోట్లు విడుదల చేసింది.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిన వరద నష్టంపై ఇవాళ (శుక్రవారం) సాయంత్రంలోగా కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. బుడమేరు గండి పూడ్చివేతలో సైన్యం సాయం తీసుకుంటున్నామని చెప్పారు.
వరద సహాయ చర్యల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి సహకారం అందిస్తోంది అని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. జాతీయ విపత్తుగా ప్రకటించడానికి కొన్ని నియమ నిబంధనలు వుంటాయి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుకుంటాయి అని ఆమె తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.. నిన్న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో.. రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా పలు నిర్ణయాలు తీసుకుంది.. దేశంలో 12 పారిశ్రామిక కారిడార్లు నిర్మిస్తుంటే అందులో ఏపీలో మూడు కారిడార్లు ఏర్పాటు చేయనున్నారు.. ఈ మూడు కారిడార్ల పై 28 వేల కోట్లు వ్యయం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. ఇక, కేంద్రం నిర్ణయాలపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..…