ఉద్యోగుల సంరక్షణ కోసం కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కింద ఉన్న ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితిని పెంచాలని కేంద్రం భావిస్తోంది. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో గరిష్ఠ వేతన పరిమితి రూ. 15వేలు ఉండగా.. దీన్ని రూ.21వేలకు పెంచనున్నట్లు సమాచారం. అలాగే ఉద్యోగుల సంఖ్య పరిమితిని కూడా తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 20 అంతకంటే ఎక్కువమంది ఉద్యోగులు ఉన్న కంపెనీలు తప్పనిసరిగా ఈపీఎఫ్‌ఓలో చేరాల్సిఉండగా.. ఈ సంఖ్యను 10-15కు తగ్గించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Finger Millet Ragulu: కాల్షియంకు కేరాఫ్ అడ్రెస్ రాగులు.. ఎలా తీసుకోవాలంటే
ఈపీఎఫ్‌ఓ గరిష్ఠ వేతన పరిమితిని చివరిసారిగా 2014లో సవరించారు. అప్పట్లో రూ.6,500గా ఉన్న మొత్తాన్ని రూ.15వేలకు పెంచారు. మరోసారి వేతన పరిమితిని పెంచితే ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాకు జమ అయ్యే మొత్తం కూడా పెరగనుంది. సాధారణంగా ఉద్యోగి వాటాగా వేతనంపై 12 శాతం, యజమాని వాటా 12 శాతం చెల్లిస్తారు. ఉద్యోగి వాటా పూర్తిగా ఈపీఎఫ్ ఖాతాలో జమవుతుంది. యజమాని వాటా నుంచి 8.33 శాతం పింఛను పథకంలో.. మిగతా మొత్తం ఈపీఎఫ్ ఖాతాలో జమవుతుంది. గరిష్ఠ వేతన పరిమితిని పెంచితే ఆ మేరకు ఉద్యోగి, యజమాని చెల్లించాల్సిన వాటా పెరుగుతుంది.
ఇది కూడా చదవండి: Ponguleti Srinivas Reddy: రేస్ కార్ల కేసుకే కంగారు పడితే ఎలా..? రాబోయే రోజుల్లో అనేక కేసులు