ఈ రోజు (శుక్రవారం) తెల్లవారుజామున చెన్నై పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీ మొత్తంలో డ్రగ్స్‌ను సీజ్ చేశారు. ఓ ముఠా కంటైనర్‌లో అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న దాదాపు 110 కోట్ల రూపాయల విలువైన నిషేధిత డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు గుర్తించారు.
కరువుతో అల్లాడుతోంది రాయలసీమ. కరువు సీమలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కోసం కడపకు కూత వేటు దూరంలోని కొప్పర్తిలో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేశాయి గత ప్రభుత్వాలు. భారీ పరిశ్రమలు వస్తాయి నిరుద్యోగ సమస్య తీరుతుంది అని ఆశల పల్లకిలో ఊరేగుతున్న నిరుద్యోగ యువతకు ఎన్డీఏ ప్రభుత్వం చేదువార్త అందించింది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏర్పాటు కానున్న ఎంఎస్ఎంఈ పరిశ్రమను విజయవాడలో ఏర్పాటు చేసేలా కేంద్రానికి ప్రభుత్వం నివేదికలు పంపిందట.. రాష్ట్ర రాజధాని అమరావతిలో దాదాపు…
మహిళలకు ఒక్కొక్కరికి రూ.8 లక్షల లబ్ధి చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద పలు రాష్ట్రాలకు చెందిన సుమారు 3000 మహిళా స్వయం సహాయక బృందాలకు (ఎస్‌హెచ్‌జి) ఈ సంవత్సరం డ్రోన్లు ఇవ్వనున్నారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2028 నాటికి భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ప్రారంభించనుంది. ఈ మేరుక ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ గతంలో కూడా వెల్లడించారు.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఇస్రోకు సంబంధించిన పలు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఇందులో చంద్రయాన్-4, వీనస్ మిషన్, ఇండియన్ స్పేస్ స్టేషన్, తదుపరి తరం ప్రయోగ వాహనాలను అభివృద్ధి చేయడం వంటి ప్రతిపాదనలు ఉన్నాయి.
వన్ నేషన్, వన్ ఎలక్షన్‌కి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టనున్నారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే దిశగా కేంద్ర మంత్రివర్గం ఈరోజు భేటీ అయింది.
గృహిణిలకు కేంద్రం శుభవార్త చెప్పింది. వంట నూనెల ధరలు పెరుగుతాయంటూ ఇటీవల వార్తలు హల్చల్ చేశాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో నూనెల ధరలు పెరుగుతాయంటూ వచ్చిన వార్తలతో భయాందోళన చెందారు.
Cooking Oil: మధ్య తరగతి ప్రజలపై మరో పిడుగు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అయింది. వంటింటి ఖర్చు ఇకపై మరింతగా పెరగబోతుంది. ముడి, రిఫైన్డ్ వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్ర సర్కార్ ఒకేసారి 20 శాతం వరకు పెంచడంతో ఆ మేరకు వంటనూనెల రేట్లు పెరగనున్నాయి.
Mpox Cases: భారతదేశంలో తొలిసారి మంకీపాక్స్ అనుమానితుడిని గుర్తించడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాధిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది.