Kishan Reddy: కిషన్‌రెడ్డి చొరవతో తెలంగాణలో పత్తి కొనుగోళ్లకు లైన్‌క్లియర్
- కిషన్ రెడ్డి చొరవతో పత్తి కొనుగోళ్లకు లైన్‌క్లియర్
- యాథావిధిగా కొనసాగనున్న పత్తి కొనుగోళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో తెలంగాణలో పత్తి కొనుగోళ్లకు ప్రతిష్టంభన తొలగింది. రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లకు లైన్ క్లియరైంది. తెలంగాణలో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయిన నేపథ్యంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో కిషన్‌రెడ్డి మాట్లాడి పరిస్థితిని వివరించారు. రైతులను ఆదుకోవాలని కోరారు. కిషన్ రెడ్డి వినతికి కేంద్ర జౌళి శాఖ మంత్రి సానుకూలంగా స్పందించారు. తెలంగాణలో పత్తి కొనుగోళ్లు జరపాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను గిరిరాజ్ సింగ్ ఆదేశించారు. దీంతో రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు యాథావిధిగా కొనసాగనున్నాయి.
ఇది కూడా చదవండి: Zomato Food Rescue: కొత్త ఫీచర్‌తో సగం ధరకే ఫుడ్ అందించనున్న జొమాటో
Also Read
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
- DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
- IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
పత్తి కొనుగోళ్లలో గత ఏడాది సీసీఐ అనుసరించిన నియమ నిబంధనలనే ఈ ఏడాది పాటించనుంది. ఇక కొనుగోలు కేంద్రాలను సైతం గత ఏడాది ఏర్పాటు చేసిన సంఖ్యకు తక్కువ కాకుండా ఈసారి ఎక్కువగా ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో పండిన పత్తిని కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.7350 చొప్పున సీసీఐ కొనుగోలు చేయనుంది. పత్తి రైతులెవరూ ఆందోళన చెందవద్దని, ఈ ఏడాది రాష్ట్రంలో పండిన పత్తిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కొందరు సృష్టించే తప్పుడు వార్తలు, పుకార్లను నమ్మి దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవద్దని రైతులకు సూచించారు. రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: IG V. Satyanarayana: అధికారులపై దాడి రాజకీయ కోణం ఉండవచ్చు.. దాడి చేసిన వారిని వదలం
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!