Lalu Prasad Yadav: ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వారి కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఇళ్లలో వరసగా ఈడీ సోదాలను నిర్వహించింది. తన కుమార్తె, మనవరాలు, కోడలును వేధిస్తున్నారంటూ లాలూ బీజేపీపై మండిపడ్డారు.
CBI Ex JD Lakshmi Narayana: దేశవ్యాప్తంగా కలకలం రేపుతోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రోజుకో మలుపు తీసుకుంటుంది.. ఓ వైపు సీబీఐ.. మరో వైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. ఈ కేసులో దూకుడు పెంచింది.. ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా మరికొంతమంది నిందితులను అరెస్ట్ చేసింది ఈడీ.. ఇక, ఇవాళ ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి కవితను ప్రశ్నిస్తోంది.. ఢిల్లీలోని ఈడీ ఆఫీస్‌లో ఈడీ విచారణ సాగుతోంది.…
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ మార్పులో అక్రమాలు జరిగాయనే ఫిర్యాదుతో లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చాయి. మొదట సీబీఐ, తర్వాత ఈడీ రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నాయి. తొలిరోజుల్లో ఢిల్లీ సర్కారును షేక్ చేసిన లిక్కర్ స్కామ్.. తర్వాత తెలుగు రాష్ట్రాల్లోనూ కలకలం రేపింది. కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన అరుణ్ రామచంద్రపిళ్లై కవితకు బినామీ అని వాంగ్మూలమిచ్చారని ఈడీ చెప్పింది. అయితే ఉన్నట్టుండి పిళ్లై…
YS Viveka Murder Case: సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది.. వరుసగా మూడోసారి ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్‌రెడ్డిని ప్రశ్నించింది.. ఇక, ఇవాళ విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన అనినాష్‌రెడ్డి.. కీలక వ్యాఖ్యలు చేశారు.. ఈ కేసులో కీలకమైన విషయాలు పక్కనబెట్టి నన్ను విచారణకు పిలిచారు.. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.. మళ్లీ పిలిచినప్పుడు విచారణకు రమ్మన్నారని తెలిపారు.. సీబీఐ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని…
YS Viveka Murder case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు.. ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది.. సోమవారం వరకు అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయొద్దు.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీబీఐ ప్రత్యేక కోర్టుకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ వివేకా కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ…
బీజేపీ కి దర్యాప్తు సంస్థలకు సంబంధమే లేదని తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ కుటుంబానికి ఏ ఆపద వచ్చినా... తెలంగాణ సమాజం అంటారని ఆరోపించారు.
Opposition letter to Modi:కేంద్ర సంస్థల దుర్వినయోగంపై 9 మంది ప్రతిపక్ష నేతలు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. తమ నేతలను ఇరికించేందుకు కేంద్ర ఏజెన్సీలను దుర్వినయోగం చేస్తున్నారని ఆరోపిస్తున్నారని ప్రతిపక్ష నేతలు లేఖలో ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఇరికించడాన్ని ఆప్ నేతలు ఉదహరించారు. ఇలాగే మరికొన్ని ఉదాహరణలను లేఖలో పేర్కొన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి)లను నేతలను ఇరికించేందుకు వాడుకుంటున్నారని దుయ్యబట్టారు.
Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీస్ సిసోడియాను అరెస్ట్ చేసింది. తాజాగా ఆయనకు కోర్టులో చుక్కెదురు అయింది. రోస్ ఎవెన్యూలోని ప్రత్యేక న్యాయస్థానం మరో రెండు రోజుల పాటు సిసోడియా కస్టడీని పొడగించింది. మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరడంతో మార్చి 6 వరకు కస్టడీని పొడగించారు. సీబీఐ మూడు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా.. కోర్టు 2 రోజుల కస్టడీ మాత్రమే పొడగించింది. మరోవైపు ఆయన…