CBI Ex JD Lakshmi Narayana: దేశవ్యాప్తంగా కలకలం రేపుతోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రోజుకో మలుపు తీసుకుంటుంది.. ఓ వైపు సీబీఐ.. మరో వైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. ఈ కేసులో దూకుడు పెంచింది.. ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా మరికొంతమంది నిందితులను అరెస్ట్ చేసింది ఈడీ.. ఇక, ఇవాళ ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి కవితను ప్రశ్నిస్తోంది.. ఢిల్లీలోని ఈడీ ఆఫీస్‌లో ఈడీ విచారణ సాగుతోంది. అరుణ్ పిళ్లై రిమాండ్ ఆధారంగా కవితను ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాత్రపై విచారణ సాగుతోంది..
Read Also: Somu Veerraju: బీజేపీలోకి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి..? ఇలా స్పందించిన సోము వీర్రాజు
జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని ఈడీ టీమ్.. కవితను ప్రశ్నిస్తున్నారు.. అయితే, గతంలో సీబీఐ జేడీగా ఉన్న సమయంలో కీలక కేసులను టేకాప్ చేసిన వీవీ లక్ష్మీనారాయణ.. ఈ కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు.. కవితను ఈడీ ప్రశ్నిస్తున్నదానిపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. కవితపై పెట్టిన కేసులు.. విచారణ ఎలా సాగుతుంది.. కోర్టు జోక్యం ఉంటుందా? కవితకు ఉన్న అవకాశాలు ఏంటి? కవితను ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఇలాంటి అనేక విషయాలపై స్పందించారు.. ఇక, ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో లక్ష్మీనారాయణ ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..