వైఎస్ వివేకా హత్యకేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇవ్వాళ హైదరాబాద్ కోఠిలోని సీబీఐ ఆఫీస్ లో విచారణ కు రావాలంటూ..ఎంపీ అవినాష్ రెడ్డి కి సీబీఐ నోటీస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సీఆర్ పీసీ సెక్షన్ 160 ప్రకారం నోటీసులు ఇచ్చింది సీబీఐ. తన విచారణ పారదర్శకంగా సాగట్లేదు అంటూ..హైకోర్ట్ ను ఆశ్రయించారు అవినాష్ రెడ్డి. హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్ పై విచారణ కొనసాగే అవకాశం ఉంది. 6 అంశాలు ప్రస్తావిస్తూ పిటిషన్ వేశారు అవినాష్ రెడ్డి. జనవరి 28, ఫిబ్రవరి 24న ఆడియో వీడియో రికార్డింగ్ లేకుండా రికార్డ్ చేసిన స్టేట్మెంట్ ను పరిగణలోకి తీసుకోవద్దు అని పిటిషన్లో పేర్కొన్నారు.
Read Also: Amit Shah: రేపు నగరానికి అమిత్ షా.. టూర్ లో మార్పులు
సిబిఐ జరిపే విచారణను మొత్తం ఆడియో వీడియో రికార్డింగ్ చేసెలా సీబీఐ కి ఆదేశాలు ఇవ్వాలి. విచారణ సందర్భంగా న్యాయవాదిని అనుమతించాలి. జనవరి 28, ఫిబ్రవరి 24 తేదీలలో సిబిఐ రికార్డ్ చేసిన నా స్టేట్మెంట్లను కోర్టుకు ప్రొడ్యూస్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలి . 5) విచారణ సందర్భంగా ఎటువంటి తదుపరి చర్యలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలి. హైకోర్ట్ లో ఈ పిటిషన్ విచారణ ముగిసే వరకు…సీబీఐ తనను విచారించకుండా స్టే ఇవ్వాలన్నారు. హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసినందున…సీబీఐ నీ అవినాష్ రెడ్డి సమయం కోరే అవకాశం ఉంది. హైకోర్ట్ నిర్ణయం తరువాతే …తనను విచారించాలని, అప్పటి వరకు తనకు సమయం ఇవ్వాలని సీబీఐ కి మెయిల్ చేసే ఆలోచనలో ఉన్నారు అవినాష్ రెడ్డి.
తన న్యాయవాదులతో న్యాయ సలహా తీసుకుంటున్నారు అవినాష్ రెడ్డి . షెడ్యూల్ ప్రకారం నేడు 11 గంటలకు సీబీఐ ముందు హాజరు కావాల్సి ఉంది. జూబ్లిహిల్స్ లోని తన నివాసంలో ఎంపీ అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి నివాసానికి చేరుకుంటున్న వై ఎస్ ఆర్ సిపి పార్టీ కార్యకర్తలు. మరి కొద్ది సేపట్లో కార్యకర్తలతో కలిసి సీబీఐ కార్యాలయానికి బయలు దేరి వెళ్ళనున్నారు అవినాష్ రెడ్డి. మరోవైపు నేడు సీబీఐ కోర్టుకు వైయస్ వివేకా హత్య కేసు నిందితులు హాజరుకానున్నారు.. చంచల్ గూడ జైల్లో జ్యుడీషియల్ ఖైదీలుగా ఉన్న ముగ్గురు నిందితులతో పాటు సీబీఐ కోర్టుకి హాజరుకానున్నారు గంగిరెడ్డి, దస్తగిరి.. నాంపల్లి సీబీఐ కోర్టుకు విచారణ బదిలీ అయిన తర్వాత ఫిబ్రవరి 10న కోర్టు ఎదుట హాజరయ్యారు నిందితులు.. మార్చి 10వ తేదీకి విచారణ వాయిదా వేసింది సీబీఐ కోర్టు. ఇవాళ నిందితులు హాజరవుతున్నారు.
Read Also: Vijayawada Durgamma Temple: ఇంద్రకీలాద్రిపై తలనీలాలు ఇస్తే నిలువు దోపిడీయే