Lalu Prasad Yadav: ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వారి కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఇళ్లలో వరసగా ఈడీ సోదాలను నిర్వహించింది. తన కుమార్తె, మనవరాలు, కోడలును వేధిస్తున్నారంటూ లాలూ బీజేపీపై మండిపడ్డారు. నిరాధారఐమన ఆరోపణ పేరుతో ప్రతీకారం తీర్చుకుంటున్నారని అన్నారు. ఎమర్జెన్సీ చీకటి రోజులను చూశామని, ఈ యుద్ధంలో కూడా పోరాడుతామని ఆయన అన్నారు. నా కూతుళ్లు, చిన్న మనవరాలు, గర్భిణీ అయిన కోడళ్లను నిరాధారమైన ప్రతీకార కేసుల్లో బీజేపీ, ఈడీ 15 గంటల పాటు విచారించిందని ఆయన ఆరోపించారు. మాతో రాజకీయ యుద్ధం చేయడానికి బీజేపీ ఇంత తక్కువ స్థాయికి దిగజారాలా..? అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.
READ ALSO: MLC Elections : తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు 137 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
ఆర్ఎస్ఎస్, బీజేపీకి వ్యతిరేకంగా తాను సైద్ధాంతిక పోరాటం చేశానని.. ఇది కొనసాగుతూనే ఉంటుందని ఆయన అన్నారు. బీజేపీ ముందు తాను తలవంచేది లేదని, మీ రాజకీయాల ముందు నా కుటుంబం, పార్టీ నుంచి ఎవరూ తలవంచరని ఆయన అన్నారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవిలను సీబీఐ విచారించిన కొన్ని రోజుల తర్వాత ఈడీ సోదాలు నిర్వహించింది. లాలూ కుమార్తెలు రాగిణి యాదవ్, చందా యాదవ్, హేమా యాదవ్ కు సంబంధించి వారి కార్యాలయాల్లో తనిఖీ చేశారు. పాట్నా, ఫుల్వారీ షరీప్, ఢిల్లీ, రాంచీ, ముంబై లో సోదాలు నిర్వహించారు.
2004 నుండి 2009 వరకు కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో లాలూ, అతని కుటుంబ సభ్యులు ఉద్యోగాల కోసం నిరుద్యోగులన నుంచి భూమిని తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ తో పాటు అనతి కుమార్తెలు మీసా భారతి,హేమ తదితరుల పేర్లను సీబీఐ నమోదు చేసింది. ఈ కేసులో లాలూ కుమారుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ను కూడా శనివారం సీబీఐ సమన్లు జారీ చేసింది. అయితే ఆయన ఈ విచారణకు హాజరుకాలేదు.
हमने आपातकाल का काला दौर भी देखा है। हमने वह लड़ाई भी लड़ी थी। आधारहीन प्रतिशोधात्मक मामलों में आज मेरी बेटियों, नन्हें-मुन्ने नातियों और गर्भवती पुत्रवधु को भाजपाई ED ने 15 घंटों से बैठा रखा है। क्या इतने निम्नस्तर पर उतर कर बीजेपी हमसे राजनीतिक लड़ाई लड़ेंगी?
— Lalu Prasad Yadav (@laluprasadrjd) March 10, 2023