సీబీఐ-ఈడీ దాడులు అవినీతిపరులందరినీ ఒకే రాజకీయ పార్టీలోకి తీసుకొచ్చాయని, కేంద్రంలో బీజేపీ పాలన ముగియగానే దేశం అవినీతి రహితంగా మారుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ఆరోపించారు.
YS Viveka Murder Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఈ రోజు కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. ప్రస్తుతం ఈ కేసు సీబీఐ దర్యాప్తులో ఉండగా.. దర్యాప్తు అధికారి రాంసింగ్ ను కొనసాగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు న్యాయమూర్తి ఎంఆర్ షా.. అయితే, తులశమ్మ కేసులో మరో దర్యాప్తు అధికారిపై సుప్రీంలో నివేదిక అందజేసింది సీబీఐ.. రాంసింగ్ తో పాటు మరోకరు పేరును సీబీఐ సూచించింది.. కాగా,…
Bribery Case: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం రాజ్‌కోట్‌లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజిఎఫ్‌టి) డైరెక్టర్ జవరిమల్ బిష్ణోయ్ ను సిబిఐ అరెస్టు చేసింది.
YS Viveka Murder Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేవకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు.. ఈ కేసులో సీబీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.. విచారణ అధికారిని మార్చాలంటూ కీలక ఆదేశాలు జారీ చేసింది.. వివేకా హత్యకేసుపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. సీబీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది ధర్మాసనం… స్టేటస్ రిపోర్టులో ఎలాంటి పురోగతి లేదని అసహనం వ్యక్తం చేశారు.. తదుపరి…
ఉద్యోగాల కోసం భూ కుంభకోణం(Land-For-Jobs Scam Case) కేసులో సీబీఐ విచారణలో దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తులో భాగంగా బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ను సీబీఐ ఈరోజు తన ప్రధాన కార్యాలయంలో ఎనిమిది గంటలకు పైగా ప్రశ్నించారు.
Supreme Court: రాహుల్ గాంధీకి పరువునష్టం కేసులో రెండు ఏళ్ల జైలు శిక్ష విధించిన తర్వాత రాజకీయం మారుతోంది. తాజాగా శుక్రవారం 14 ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తుందని ఆరోపిస్తూ అత్యున్నత న్యాయస్థానం తలుపుతట్టారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి), ఐటీ వంటి సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో సిసోడియా తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు.