Supreme Court: వివేకా హత్య కేసు దర్యాప్తు ఆలస్యంపై సుప్రీకోర్టు సీరియస్ అయింది. వివేకా హత్య కేసు విచారణ ఎంతవరకు వచ్చిందో చెప్పాలని సుప్రీంకోర్టు అడిగింది. విచారణపై తాజా పరిస్థితిని సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. వివేకా హత్య కేసును ఎందుకు దర్యాప్తు చేయడం లేదని సీబీఐని ప్రశ్నించింది. దర్యాప్తు అధికార ఎందుకు విచారణను జాప్యం చేస్తున్నారని అడిగింది. విచారణ త్వరగా ముగించకపోతే వేరే దర్యాపు అధికారిని ఎందుకు నియమించకూడదని వ్యాఖ్యానించింది.
Akhilesh Yadav: ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తోందని సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. గతంలో కాంగ్రెస్ కూడా ఇదే విధంగా చేసిందని, ప్రస్తుతం కాంగ్రెస్ పని అయిపోయిందని, రానున్న కాలంలో బీజేపీకి కూడా ఇదే గతి పడుతుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు మరో 5 రోజుల కస్టడీని పొడగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో మరో 7 రోజులు సిసోడియాను విచారించేందుకు సమయం కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కోర్టును కోరింది. అయితే కోర్టు మరో 5 రోజుల కస్టడీకి అప్పగించింది.
ఢిల్లీ ప్రభుత్వ ‘ఫీడ్‌బ్యాక్ యూనిట్’లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గురువారం తాజా కేసు నమోదు చేసింది.
YS Viveka Murder Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.. సీబీఐ దూకుడు చూపిస్తోంది.. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారిని వరుసగా ప్రశ్నిస్తోంది.. ఇప్పటికే వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని మూడు సార్లు ప్రశ్నించిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ).. నాల్గోసారి ప్రశ్నించేందుకు సిద్ధమైంది.. ఇప్పటికే అవినాష్‌రెడ్డికి నోటీసులు పంపగా.. వాటికి అనుగుణంగా ఈ రోజు విచారణకు హాజరుకానున్నారు.. హైదరాబాద్‌లోని సీబీఐ…
తృణమూల్ కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని కేంద్ర సంస్థల దుర్వినియోగానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సోమవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అయితే మోషన్‌ను చదివే సమయంలో తమ సభ్యులు అసెంబ్లీకి హాజరుకావడం అవినీతి కేసులకు మద్దతు ఇచ్చినట్లే అవుతుందని పేర్కొంటూ బీజేపీ సభను వాకౌట్ చేసింది.
MLA Purchase Case: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. తదుపరవి ఇచారణను జులైకి వాయిదా వేసింది.. ఇక, విచారణ సందర్భంగా దర్యాప్తుపై స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.. కేసు న్యాయస్థానం పరిధిలో ఉన్నందున దర్యాప్తు కొనసాగించవద్దని నిబంధన ఉందని స్పష్టం చేశారు న్యాయమూర్తి.. అప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు రికార్డులు సీబీఐకి అందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో…
మాజీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు.
lalu Prasad Yadav: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, అతని కుటుంబ సభ్యులపై ఈడీ, సీబీఐ విచారణ జరుపుతోంది. ఆయన కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ చేశారనే అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఈడీ లాలూతో పాటు అతని కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఇళ్లపై దాడులు చేసింది. ఈ రైడ్స్ లో విస్తూపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి కీలక వ్యక్తులను సీబీఐ విచారిస్తోంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని ఆదివారం సీబీఐ విచారించనుంది.