YS Viveka Murder case: అవినాష్‌రెడ్డి పిటిషన్‌పై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Viveka Murder case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు.. ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది.. సోమవారం వరకు అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయొద్దు.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీబీఐ ప్రత్యేక కోర్టుకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ వివేకా కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది..
Read Also: Naresh- Pavitra: జనాలు మీ కంటికి పిచ్చోళ్లలా కనిపిస్తున్నారా..?
Also Read
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
- CM Revanth Reddy: హైదరాబాద్‌కి నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్!
- Off The Record: ఒకే పార్టీకి రెండు ఆఫీసులా..? అక్కడ బీజేపీలో పీక్స్‌కు చేరిన గ్రూప్ వార్..!
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఎంపీ అవినాష్‌రెడ్డి.. ఇప్పటికే రెండోసార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారు.. తాజా నోటీసుల మేరకు ఇవాళ మూడోసారి సీబీఐ ముందు హాజరయ్యారు అవినాష్‌రెడ్డి. మరోవైపు.. అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. సోమవారం వరకు అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయొద్దు.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని స్పష్టం చేసింది.. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కాగా, తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు అవినాష్‌రెడ్డి. వివేకా హత్య కేసులో సీబీఐ తనను విచారించే సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా సీబీఐని ఆదేశించాలని కోరారు. తన న్యాయవాది సమక్షంలోనే విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు అవినాష్‌రెడ్డి. సీఆర్‌పీసీ సెక్షన్ 160కింద నోటీసులు ఇచ్చారు కనుక కఠిన చర్యలు తీసుకోకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని కోరిన విషయం విదితమే.
Read Also: Minister KTR: బీబీసీ మీదనే దాడి చేసినోడికి మీరెంత.. తెలంగాణ భవన్‌లో కేటీఆర్
ఇక, వైఎస్ వివేకా హత్య కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న దస్తగిరిని ఇప్పటికీ సీబీఐ అరెస్ట్ చేయలేదన్నారు అవినాష్‌రెడ్డి. దస్తగిరి అక్కడ, ఇక్కడ చెప్పిన మాటల ఆధారంగానే సీబీఐ విచారణ జరుగుతోందన్నారు. తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించిన ఎంపీ.. తాను చెప్పిన విషయాలను కూడా విచారణ అధికారి మార్చేస్తున్నారన్నారు. దర్యాప్తు అధికారి తీరు పక్షపాతంగా ఉందన్నారు. తనే నేరం చేసినట్లు ఊహించుకుని ఆ దిశగానే విచారణ చేస్తున్నారన్నారు. తప్పుడు సాక్ష్యాలు ఇచ్చేలా విచారణాధికారి కొందరిపై ఒత్తిడి చేస్తున్నారన్నారు అవినాష్‌రెడ్డి. గత విచారణకు సంబంధించి కూడా కీలక అంశాలు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు అవినాష్‌రెడ్డి. ఆడియో వీడియో రికార్డు చేయకుండా కేవలం టైప్ మాత్రమే చేశారని అందులో కొన్ని అంశాలను తన ఎదురుగానే విచారణ అధికారి తొలగించారని ఆరోపించారు. తను చెప్పింది రాసుకున్నారో వారికిష్టమైనట్లు రాసుకున్నారో తెలియడం లేదన్నారు. ఆ రిట్‌పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. సోమవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది.. అయితే, సోమవారం కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది.. ఇవాళ సీబీఐ ఎలాంటి ప్రశ్నలను ఎంపీ అవినాష్‌రెడ్డిపై సందించింది అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!