Delhi Liquor Case: మనీష్ సిసోడియాకు మరో 5 రోజుల కస్టడీ పొడగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు మరో 5 రోజుల కస్టడీని పొడగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో మరో 7 రోజులు సిసోడియాను విచారించేందుకు సమయం కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కోర్టును కోరింది. అయితే కోర్టు మరో 5 రోజుల కస్టడీకి అప్పగించింది. మార్చి 20తో సిసోడియా కస్టడీ ముగుస్తుండటంతో విచారణకు మరింత సమయం కావాలని ఈడీ కోరిన నేపథ్యంలో కస్టడీని పొడగించింది. ఈడీ తనను ప్రతీ రోజు 30 నిమిషాల నుంచి గంట వరకు విచారించిందని, ఇకపై తనను జైలులో ఉంచాల్సిన అవసరం లేదని మనీష్ సిసోడియా కోర్టులో వాదించారు. రోజూ ఈడీ తనను అవే ప్రశ్నలు అడుగుతున్నారని కోర్టుకు సిసోడియా వెల్లడించారు.
ఢిల్లీ కొత్త లిక్కర్ పాలసీలో అవినీతికి పాల్పడ్డారనే అభియోగంపై ఇటీవల సీబీఐ మనీస్ సిసోడియాను అరెస్ట్ చేసింది. ఆ తరువాత ఈడీ తన కస్టడీలోకి తీసుకుంది. గత నెల ఫిబ్రవరి 26 నుంచి సిసోడియా జైలులో ఉన్నారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ ప్రస్తుతం విచారణ జరుపుతోంది. ఏడు నెలల పాలు కేసును విచారించిన తర్వాత, కస్టడీకి కోరారని, దర్యాప్తు సంస్థలు దీని వల్ల ఏం సంపాదించిందో చూపించాలని సిసోడియా తరుపున న్యాయవాది కోరారు.
Also Read
- Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
- Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్..!
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
Read Also: Labourer Wins Lottery: రూ.75 లక్షలు గెలుచుకున్న కూలీ.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు పరుగు
తనకు కస్టడీని పొడగించడాన్ని సిసోడియా వ్యతిరేకించారు. ఈడీ, సీబీఐ పని చేస్తోందని ఆరోపించారు. ఈడీ కేవలం నేరం ద్వారా వచ్చిన ఆదాయాలపై మాత్రమే దర్యాప్తు చేయగలదని, నేరంపై కాదని సిసోడియా కోర్టులో పేర్కొన్నారు. ఈ కేసులో సిసోడియా ఆయన సెల్ ఫోన్ ను పలుమార్లు మార్చాడని ఈడీ ఆరోపించింది. ఈడీ ఎప్పుడూ మొబైల్ ఫోన్ల ధ్వంసం చేశారనే అంశాన్ని లేవనెత్తుతోందని, సీబీఐ, ఈడీలు దీన్ని రిమాండ్ రిపోర్టులోనే ప్రస్తావించారని, ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి దర్యాప్తు సంస్థలు ఏంచేస్తున్నాయంటూ సిసోడియా లాయర్ కోర్టులో ప్రశ్నించారు. సిసోడియాను ఎట్టి పరిస్థితుల్లో జైలులోనే ఉంచాలని వారు కోరకుంటున్నారని ఆప్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉంటే బీజేపీ కావాలనే ఆప్ పై తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ విద్యావ్యవస్థలో మార్పులు తీసుకువచ్చిన సిసోడియాను కావాలనే టార్గెట్ చేస్తున్నట్లు ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ కేజ్రీవాల్ విమర్శిస్తున్నారు. ఢిల్లి లిక్కర్ పాలసీలో సౌత్ గ్రూప్ తో సిసోడియా అక్రమాలకు పాల్పడ్డారని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
Ravindra Jadeja: జడేజా చాలా హ్యాండ్సమ్, నా ఫేవరెట్ క్రికెటర్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Pawan Kalyan: ఇన్నాళ్లు నాయకులు, పార్టీల కోసం జిందాబాద్ కొట్టాం.. ఇకపై యువత భవిత కోసం జై కొట్టాలి!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
ట్రెండింగ్
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్‌ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!