MLA Purchase Case: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. తదుపరవి ఇచారణను జులైకి వాయిదా వేసింది.. ఇక, విచారణ సందర్భంగా దర్యాప్తుపై స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.. కేసు న్యాయస్థానం పరిధిలో ఉన్నందున దర్యాప్తు కొనసాగించవద్దని నిబంధన ఉందని స్పష్టం చేశారు న్యాయమూర్తి.. అప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు రికార్డులు సీబీఐకి అందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం.. ఈ మేరకు ఆదేశాలు ఇస్తూ.. తదుపరి విచారణను జూలై 31వ తేదీకి వాయిదా వేసింది.
Read Also: AAP Punjab Minister: సీనియర్ పోలీసు అధికారిని పెళ్లాడనున్న ఆప్ మంత్రి
కాగా, తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యే కొనుగోలు కేసు.. దేశవ్యప్తంగా చర్చగా మారింది.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును తెలంగాణ హైకోర్టు సీబీఐకి అప్పగించడంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గతేడాది డిసెంబర్ 26న ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్డీ బెంచ్ తీర్పు ఇచ్చింది. హైకోర్టు సింగిల్ జడ్డీ బెంచ్ ఇచ్చిన తీర్పును ఫిబ్రవరి5న హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా సమర్థించింది. దీంతో, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఫిబ్రవరి 7వ తేదీన సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో సీబీఐ విచారణ ప్రారంభిస్తే సాక్షాలన్నీ విధ్వంసమవుతాయని ఆందోళన వ్యక్తం చేసిన విషం విదితమే.