Bengal Assembly: తృణమూల్ కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని కేంద్ర సంస్థల దుర్వినియోగానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సోమవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అయితే మోషన్‌ను చదివే సమయంలో తమ సభ్యులు అసెంబ్లీకి హాజరుకావడం అవినీతి కేసులకు మద్దతు ఇచ్చినట్లే అవుతుందని పేర్కొంటూ బీజేపీ సభను వాకౌట్ చేసింది. పశ్చిమ బెంగాల్ శాసనసభలో వ్యాపార విధానాలు, ప్రవర్తన నియమాలు 185 కింద సీనియర్ తృణమూల్ తపస్ రాయ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
మంత్రి పార్థ భౌమిక్‌ను నెల రోజుల్లోగా కటకటాల వెనక్కి నెట్టివేస్తామని ప్రతిపక్ష నేత సువేందు అధికారి చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ, రాజకీయ నేతలను వేధించడం కోసం దేశంలో 2014 నుంచి కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని రాయ్ అన్నారు. సువేందు అధికారికి వ్యతిరేకంగా పార్థ భౌమిక్ ప్రివిలేజ్ మోషన్‌ను సమర్పించారు. “ప్రతిపక్ష నాయకుడు మంత్రులతో సహా రాష్ట్ర అధికార పక్ష సభ్యులను భయంకరమైన పరిణామాలతో ఎలా బెదిరించారో మేము చూశాము” అని రాయ్ అన్నారు. తీర్మానంపై రాష్ట్ర మంత్రి చంద్రిమా భట్టాచార్య మాట్లాడుతూ.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తృణమూల్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ఎంపిక చేసి భయాందోళన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని ఆరోపించారు. తృణమూల్‌పై దుష్ప్రచారం చేయడమే వారి ఉద్దేశ్యమని, బీజేపీ రాజకీయంగా పోరాడలేకనే కేంద్ర ఏజెన్సీలను పార్టీ నేతలపై ప్రయోగిస్తున్నారని ఆమె అన్నారు.
Read Also: Ankita Bhandari Case: అంకితా భండారీ హత్య కేసు.. దర్యాప్తుపై స్టేటస్ రిపోర్ట్‌ను కోరిన సుప్రీం
అనంతరం బీజేపీ చీఫ్ విప్ మనోజ్ తిగ్గ విలేకరులతో మాట్లాడుతూ ఆరోపణలు నిరాధారమైనవన్నారు. “అక్కడ ఉండడం వల్ల టీఎంసీ చెప్పేదానికి మద్దతివ్వడమేనని మేము భావించి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశాం, ఇది పచ్చి అబద్ధం తప్ప మరొకటి కాదు” అని ఆయన అన్నారు. కుంభకోణాలు, అవినీతి కేసుల్లో ప్రమేయం ఉన్నారనే ఆరోపణలపై ఇటీవలి కాలంలో పలువురు తృణమూల్ నేతలు, మంత్రులను కేంద్ర అధికారులు అరెస్టు చేశారు.