Supreme Court: రాహుల్ గాంధీకి పరువునష్టం కేసులో రెండు ఏళ్ల జైలు శిక్ష విధించిన తర్వాత రాజకీయం మారుతోంది. తాజాగా శుక్రవారం 14 ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తుందని ఆరోపిస్తూ అత్యున్నత న్యాయస్థానం తలుపుతట్టారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి), ఐటీ వంటి సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Read Also: Delhi Riots Case: ఢిల్లీ అల్లర్లలో ఆప్ కీలక నేతపై మర్డర్ కేసు..
కేంద్ర దర్యాప్తు సంస్థలు కేవలం ప్రతిపక్షాలనే టార్గెట్ చేస్తున్నాయని, బీజేపీలో చేరిన తర్వాత నేతలపై కేసులు ఎత్తివేయడం లేదా విచారణ ఆలస్యం చేయడం వంటివి చేస్తోందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. సెంట్రల్ ఏజెన్సీలు స్వతంత్రంగా పనిచేస్తున్నాయనే బీజేపీ వ్యాఖ్యలను విపక్షాలు ఖండించాయి. సుప్రీంకోర్టుకు వెళ్లిన పార్టీల్లో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, జనతాదళ్-యునైటెడ్, భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్), రాష్ట్రీయ జనతాదళ్, సమాజ్ వాదీ పార్టీ, శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం), నేషనల్ కాన్ఫరెన్స్, నేషనలిస్ట్ పార్టీలు సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశాయి. కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, డిఎంకె పార్టీలు ఉన్నాయి.
ఏప్రిల్ 5న ఈ అంశాన్ని జాబితా చేయడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ప్రస్తుతం 95 శాతం కేసులు ప్రతిపక్ష నాయకులపైనే ఉన్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ కేసుల, లాలూ ప్రసాద్ యాదవ్ ల్యాండ్ ఫర్ జాబ్ కేసును ప్రముఖంగా సీబీఐ, ఈడీ విచారిస్తున్నాయి. రాహుల్ గాంధీకి రెండు ఏళ్ల జైలు శిక్ష విధించిన తర్వాత ప్రతిపక్షాలు ఈ రోజు సుప్రీంకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.