Akhilesh Yadav: ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తోందని సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. గతంలో కాంగ్రెస్ కూడా ఇదే విధంగా చేసిందని, ప్రస్తుతం కాంగ్రెస్ పని అయిపోయిందని, రానున్న కాలంలో బీజేపీకి కూడా ఇదే గతి పడుతుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
Read Also: IND vs AUS 2nd ODI: పేకమేడల్లా కూడిన భారత్.. 117 పరుగులకే ఆలౌట్
2024 ఎన్నికల్లో కులగణన కీలకం అవుతుందని ఆయన అన్నారు. యూపీఏ-2 హయాంలో కుల గణన చేపడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అయితే ఆ తర్వాత వెనక్కి తగ్గిందని ఆయన ఆరోపించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కుల గణనను నిర్వహించాలని మేము కోరుకుంటున్నామని, పలువురు నాయకులు దీనిని డిమాండ్ చేస్తున్నారని, కానీ కాంగ్రెస్ మాదిరిగానే, బీజేపీ కూడా దానిని నిర్వహించడానికి ఆసక్తి చూపడం లేదని ఆయన అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైనా నిలబడిని ఈడీ, సీబీఐ, ఐటీలతో దాడులు చేస్తున్నారంటూ విమర్శించారు.
కాంగ్రెస్ లేకుండా కొత్త ప్రతిపక్ష ఫ్రంట్ ఏర్పాటు చేయనున్నట్లు మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని అన్నారు. కాంగ్రెస్ తన పాత్రను నిర్ణయించుకోవాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అమెథీ, రాయ్ బరేలి నుంచి ఎస్పీ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. తమ కార్యకర్తలు ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ గెలవడానికి సాయం చేశాయని, అయితే తమ కార్యకర్తలకు కష్టం వచ్చినప్పుడు కాంగ్రెస్ పట్టించుకోలేదని అఖిలేష్ అన్నారు.