కేంద్ర మాజీ మంత్రి, ఎన్‌సీపీ నేత ప్రఫుల్ పటేల్ యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన విమానాల లీజు వ్యవహారంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని తాజాగా సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లోక్ సభ ఎన్నికలకు ముందు ఐటీ విభాగం కాంగ్రెస్ పార్టీ ఖాతాలను ఫ్రీజ్ చేయటం లాంటి అంశాలపై తాజాగా ఐక్యరాజ్యసమితి రియాక్ట్ అయింది.
ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED),సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేష్‌న్(CBI) స్వతంత్ర దర్యాప్తు సంస్థలని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు.
లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ కస్టడీ నేటితో ముగుస్తుంది. దీంతో కేజ్రీవాల్‌ను నేటి మధ్యాహ్నం 2 గంటలకు రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి భయం.. అందుకే ఆయనను అరెస్ట్ చేయించారని శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు.
ఏపీలో పెను ప్రకంపనలు రేపుతున్న డ్రగ్స్ వ్యవహారంపై పూర్తి వివరాలను సీబీఐ ఎఫ్‌ఐఆర్‌తో పాటు ఓ నివేదిక రూపంలో పొందుపరిచింది. సంధ్య ఆక్వా చిరునామాతో బ్రెజిల్ నుంచి విశాఖ చేరిన ఇన్‌యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ నుంచి 49 నమూనాల్ని పరీక్షించగా 48 నమూనాల్లో కొకైన్, మెథక్వలోన్ వంటి మాదక ద్రవ్యాలున్నట్లు తేలింది.
విశాఖ డ్రగ్స్ కేసులో సంధ్య ఆక్వా పరిశ్రమలకు సంబంధం ఉందని నేపథ్యంలో మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వా పరిశ్రమను రెండు రోజుల పాటు సీబీఐ దాడులు నిర్వహించిన విషయం తెలిందే.. అంతా సజావుగా ఉంది అనుకునే సమయంలో కొత్త మూలపేట ఎస్‌ఈజెడ్ కాలనీలో సంధ్య ఆక్వాకు చెందిన బస్సు కొన్ని రోజులుగా నిలిపివేసి ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
విశాఖపట్నంలో డ్రగ్స్ అక్రమ రవాణాపై విశాఖ మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోషియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సంధ్య ఆక్వా ఎక్స్ పోర్ట్ ఎఫెక్ట్ తో మత్స్య ఎగుమతులకు తీవ్ర విఘాతం కలుగుతోంది అని ఆవేదన వ్యక్తం చేసింది. ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే ఉత్పత్తులపై నిషేధం విధించే ప్రమాదం ఏర్పడింది అని పేర్కొన్నారు.
విశాఖపట్నం డ్రగ్ కంటైనర్ కేసు విచారణలో సీబీఐ అధికారులకి కొత్త డౌట్స్ వస్తున్నాయి. నాలుగు రోజుల విచారణలో కీలక ఆధారాలు లభ్యం అయ్యాయి. ఆరు రకాల నిషేధిత సింథటిక్ డ్రగ్స్ అవశేషాలు గుర్తించారు.
Cash-For-Query Case: క్యాష్ ఫర్ క్వేరీ కేసులో కోల్‌కతాలోని తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రా ఇంట్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఈరోజు సోదాలు నిర్వహించింది.