Veterinary student Case: వయనాడ్ స్టూడెంట్ డెత్ కేస్.. 29 గంటల పాటు సీనియర్ల దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Veterinary student Case: కేరళలో సంచలన సృష్టించిన వయనాడ్ వెటర్నరీ విద్యార్థి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణ ప్రారంభించింది. వయనాడ్ జిల్లాలో ఓ కాలేజ్ హాస్టల్‌లో 20 ఏళ్ల సిద్ధార్థన్ ఫిబ్రవరి 18న హాస్టల్ బాత్‌రూమ్‌లో చనిపోయి కనిపించాడు. కేరళ అధికార పార్టీ సీపీఎం విద్యార్థి విభాగమైన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) కార్యకర్తలతో సహా, ఇతర సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేయడంతో పాటు తీవ్రంగా దాడి చేయడంతో ఆత్మహత్య చేసుకుని మరణించాడు.
సిద్ధార్థన్ ఆత్మహత్య చేసుకునేందుకు ముందు సీనియర్లు, ఇతర విద్యార్థులు కంటిన్యూగా 29 గంటల పాటు హింసించి దాడి చేశారని, కేరళ పోలీసులు సీబీఐకి అందించిన ఆత్మహత్య కేసు ఫైల్‌లో తెలిపారు. వైతిరి పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ ప్రశోభ్ పివి.. కేసు ఫైల్‌లో సిద్ధార్థన్‌ని సీనియర్లు, తోటివారు ‘‘శారీరకంగా మానసికంగా హింసించారు’’ అని రాశారు. ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ఫిబ్రవరి 17 మధ్యాహ్నం 2 గంటల వరకు సిద్ధార్థన్‌పై బెల్టుతో నిరంతరం దాడి చేసి, క్రూరంగా ర్యాగింగ్‌కి పాల్పడ్డారు. దీంతో అతను మానసిక ఒత్తిడికి గురై ఫిబ్రవరి 18వ తేదీ మధ్యాహ్నం 12.30 నుంచి 13.45 గంటల మధ్య మెన్స్ హాస్టల్‌లో బాత్‌రూమ్‌లో ఉరి వేసుకుని మరణించాడని పోలీస్ నివేదిక పేర్కొంది.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
Read Also: LSG vs GT: కేఎల్ రాహుల్ ‘స్పేర్ టైర్’ లాంటోడు.. సిద్ధూ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఈ కేసులో 20 మందిపై వయనాడ్‌లోని వైత్తిరి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసుపై రాజకీయ దుమారం చెలరేగడంతో మార్చి 9న కేరళ సీఎం పినరయి విజయన్ సీబీఐ విచారణకు హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత కూడా కీలక ఫైళ్లను ఇంకా సీబీఐకి అందచేయలేదని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ ఆరోపించడంతో ఈ అంశం పెద్ద వివాదానికి దారి తీసింది. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే సీబీఐ విచారణకు కాలయాపన చేసి సాక్ష్యాలను ధ్వంసం చేసిందని విద్యార్థి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
సీబీఐ దర్యాప్తు వేగవంతం చేస్తామని విద్యార్థి కుటుంబానికి తిరువనంతపురం లోక్‌సభ బీజేపీ అభ్యర్థి, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. విద్యార్థి తండ్రి జయప్రకాష్ తన కొడుకు చనిపోవడానికి 8 నెలల ముందు కూడా వేధింపులకు గురయ్యాడని ఆరోపించారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థులు చాలా కాలంగా కాలేజీలోనే ఉంటున్నారని, తన కుమారుడి బట్టలు విప్పి మోకాళ్లపై కూర్చోబెట్టారని ఆరోపించారు.
తాజావార్తలు
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
-
OTR: కాంగ్రెస్-బీఆర్ఎస్ కలుస్తాయా? SIRపై కలిసి పోరాడతారా?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!