Sandeshkhali: లోక్‌సభ ఎన్నికల ముందు పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ ప్రాంతం ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి చెందిన పలువురు నేతులు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడటంతో అక్కడి మహిళలు తిరగబడ్డారు.
Sandeshkhali: దేశంలో రాజకీయంగా చర్చనీయాంశమైన పశ్చిమ బెంగాల్ సందేశ్‌ఖాలీ మహిళల లైంగిక వేధింపులు, భూకబ్జా, హింసకు సంబంధించిన కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో సారి నిరాశ ఎదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి సీబీఐ అరెస్టుపై కవిత వేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును మే 2కు రిజర్వ్ చేసింది. ఈడీ అరెస్టులో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై రౌస్ అవెన్యూ కోర్టులో నేడు విచారణ జరగనుంది. ఈ కేసులో మార్చి 15న కవితను హైదరాబాద్‌లో ఈడీ అరెస్టు చేసి 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే. కోర్టు అనుమతితో రెండు విడతలుగా 10 రోజులు ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారించింది.
రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్‌గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్‌గా మారారు. అప్రూవర్‌గా మారిన తర్వాత సెక్షన్ 164 కింద సీబీఐ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సీబీఐకు ఫిర్యాదు చేశారు. ప్రజాశాంతి పార్టీ, గ్లోబల్ పీస్ కమిటీ ఆధ్వర్యంలో.. కోఠిలోని సీబీఐ జీడీకి కంప్లైంట్ చేసినట్లు పాల్ తెలిపారు.
MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కుంభకోణం విచారణలో భాగంగా కవితకు రూస్ అవెన్యూ కోర్టు ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. సీబీఐ అభ్యర్థన మేరకు రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు 3 రోజుల కస్టడీ విధించింది. దీంతో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కవితను సీబీఐ తమ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది.
ఢిల్లీ మద్యం కేసులో తీహార్ జైల్లో ఉన్న మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తాజాగా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తనకు బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆయన అభ్యర్థించారు