CBI: లంచం కేసులో ప్రభుత్వ అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్‌తో సహా ముగ్గురి అరెస్ట్, భారీ నగదు స్వాధీనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అవినీతి, లంచగొండితనాన్ని అరికట్టేందుకు సీబీఐ చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆగడాలు ఆగటం లేదు. తాజాగా.. లంచం కేసులో అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్‌సిఓ), సబార్డినేట్ ఉద్యోగిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. వీరందరినీ డ్రగ్ కంట్రోలర్ (ఇండియా) కార్యాలయంలో నియమించారు. వీరంతా లంచం తీసుకున్న ఆరోపణలపై అరెస్టు చేసి అనంతరం కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు.. ఏప్రిల్ 8 వరకు పోలీసు కస్టడీకి తరలించారు.
సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ కార్యాలయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు సమాచారం అందింది. దీంతో.. సీబీఐ, విజిలెన్స్ అధికారులు సంబంధిత కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కాగా.. ఔషధాల తయారీదారులు, ఎగుమతిదారులు, దిగుమతిదారులకు ఎన్‌ఓసీ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వ ఉద్యోగుల తరపున ప్రైవేట్ వ్యక్తులు లంచం వసూలు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
Also Read
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Gautam Gambhir: "ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?".. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
Earthquake: హిమాచల్ ప్రదేశ్‌లో 5.3 తీవ్రతతో భూకంపం..
సీబీఐతో సహా వివిధ బృందాల ఆకస్మిక తనిఖీల్లో ప్రభుత్వోద్యోగులు, ప్రైవేట్ వ్యక్తుల డ్రాయర్ల నుంచి దాదాపు రూ.1.52 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత ప్రభుత్వోద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులు ఈ డబ్బుకు సంబంధించి ఎటువంటి సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయారు. NOCలు జారీ చేయడం కోసం నేరుగా లేదా CHAలు లేదా వారి ప్రతినిధుల నుండి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా సందేహాస్పదమైన ప్రభుత్వ ఉద్యోగులు లంచంగా లెక్కించబడని డబ్బును స్వీకరించినట్లు నివేదించబడింది.
లంచం తీసుకున్నారనే ఆరోపణలపై ఆకస్మిక తనిఖీల్లో పట్టుబడిన అధికారులను అరవింద్ ఆర్. హివాలే (అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్), దేవేంద్ర నాథ్ (డ్రగ్ ఇన్‌స్పెక్టర్), నాగేశ్వర్ ఎన్. సబ్బాని (సబార్డినేట్ స్టాఫ్)గా గుర్తించారు. లంచం డిమాండ్, అంగీకరించడంపై సీబీఐకి లిఖితపూర్వక ఫిర్యాదులు అందాయి. వారి ఇళ్లలో సోదాలు చేయగా, వారి వద్ద నుంచి సుమారు రూ.46.70 లక్షల విలువైన పత్రాలు, నగదు, రూ.27.80 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. దీనితో పాటు, వివిధ స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు మరియు ఇతర అభ్యంతరకర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!