Anurag Thakur: ఈడీ, సీబీఐతో మా పార్టీకి సంబంధం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED),సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేష్‌న్(CBI) స్వతంత్ర దర్యాప్తు సంస్థలని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. ఈ పదేళ్లలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అవినీతిపరుడని దేశంలో ఏ ఒక్కరు కూడా ఆరోపణలు చేయలేదు అని ఆయన తెలిపారు. ఇక, 2013లో ఢిల్లీ సీఎం ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.. కాంగ్రెస్‌తో ఎట్టిపరిస్థితుల్లో జత కట్టనన్నారు.. ఆప్, కాంగ్రెస్ పార్టీ వారి సొంతంగా ఏం సాధించలేదన్నారు. ప్రతి రోజు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పిస్తారు.. వాళ్లు మోడీని ఎంత దూషిస్తే.. బీజేపీ అభ్యర్థులను ప్రజలు అంత ఎక్కువ మెజార్టీతో గెలిపించుకుంటారని అనురాగ్ ఠాకూర్ అన్నారు.
Also Read
ఇక, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు దర్యాప్తు సంస్థ ఈడీ తొమ్మిది సార్లు నోటీసులు జారీ చేసింది.. ఎందుకు హాజరు కాలేదు అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. మళ్లీ విలువల గురించి వాళ్లు మాట్లాడతారు.. ఆయన ఈడీ ఆఫీసుకు హాజరు కాకపోతే.. ఈడీనే ఆయన ఇంటికి పోయింది.. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆప్ ఒక్క సీటు కూడా గెలవలేదు.. మళ్లీ 2024 ఎన్నికలో సైతం ఆప్ ఒక్క సీటు గెలుచుకోదు.. ఈ రోజుకీ జైలులో ఉండి కూడా కేజ్రీవాల్ విలువల గురించి మాట్లాడటం దారుణం అన్నారు. ఇక, ఈడీ, సీబీఐ స్వతంత్ర సంస్థలు వాటి పని అవి చేసుకుంటూ వెళ్తాయి.. కేంద్ర దర్యాప్తు సంస్థలతో బీజేపీకి ఎలాంటి సంబంధంలేదని అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.
Read Also: Balayya : రికార్డులు కొత్తేమి కాదు.. సృష్టించాలన్న నేనే.. తిరగరాయాలన్న నేనే..!
అయితే, ప్రతిపక్షాల ఇండియా కూటమిపై కూడా కేంద్ర మంత్రి విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాల కూటమి నిజాయితీగా ఉంటే.. ఎందుకు ఆ కూటమి పేరు మార్చారు? అని అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ 2జీ, సబ్‌మెరైన్, బోగ్గు కుంభకోణాలు చేశారు అని ఆరోపించారు. ఆ తర్వాత దాణా కుంభకోణం చేసిన లాలు ప్రసాద్ యాదవ్‌ను సైతం కూటమిలోకి చేర్చుకున్నారు.. జైలుకు వెళ్లిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఇండియా కూటమిలో ఉన్నారని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు