Vizag Drugs Case: డ్రగ్స్ కంటైనర్ కేసు.. కీలకంగా మారిన నార్కోటిక్స్ ల్యాబ్ సర్టిఫికెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Drugs Case: ఏపీలో పెను ప్రకంపనలు రేపుతున్న డ్రగ్స్ వ్యవహారంపై పూర్తి వివరాలను సీబీఐ ఎఫ్‌ఐఆర్‌తో పాటు ఓ నివేదిక రూపంలో పొందుపరిచింది. సంధ్య ఆక్వా చిరునామాతో బ్రెజిల్ నుంచి విశాఖ చేరిన ఇన్‌యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ నుంచి 49 నమూనాల్ని పరీక్షించగా 48 నమూనాల్లో కొకైన్, మెథక్వలోన్ వంటి మాదక ద్రవ్యాలున్నట్లు తేలింది. అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ రాకెట్‌ను ఛేదించేందుకు సీబీఐ 55 గంటల సుదీర్ఘ ఆపరేషన్‌ను కొనసాగించింది. బ్రెజిల్ నుంచి విశాఖకు నంబరు కంటైనర్ వస్తోందని, అందులో భారీగా డ్రగ్స్ ఉన్నాయని.. ఈ నెల 18న ఇంటర్‌పోల్ నుంచి ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి మెయిల్ అందింది. దాన్ని పట్టుకుని తనిఖీ చేయాలని అందులో సూచించింది. ఆ సమాచారం ఆధారంగా నిమిషాల వ్యవధిలో సీబీఐ ఫిర్యాదును రిజిస్టర్ చేసింది. సీబీఐ ఎస్పీ గౌరవ్‌మిట్టల్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటైంది.
Read Also: Visakha Drugs Case: విశాఖ డ్రగ్స్ కేసులో సంధ్య ఆక్వా చుట్టూ బిగుస్తున్న వచ్చు
Also Read
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
- Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులకు తాము ఎందుకొచ్చామో వివరించి తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు ప్రారంభించాయి. కంటెయినర్‌లోని ఒక్కో ప్లాస్టిక్ బ్యాగ్ తీస్తుంటే లేత పసుపు రంగు పొడి బైటపడింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నుంచి తీసుకొచ్చిన ‘నార్కోటిక్ డ్రగ్స్ డిటెక్షన్’ కిట్‌ను ఉపయోగించి అధికారులు పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం డ్రగ్ కంటైనర్ కేసులో నార్కోటిక్స్ ల్యాబ్ సర్టిఫికెట్ కీలకంగా మారింది. మరో రెండు రోజుల్లో నివేదిక వస్తుందని సీబీఐ అంచనా వేసింది. అనుమానిత డ్రగ్స్ మిక్సింగ్ నిర్ధారణ జరిగితే కీలక చర్యలకు సీబీఐ ఉపక్రమించనుంది. న్యాయమూర్తి సమక్షంలో శాంపిల్స్‌ను సేకరించిన తర్వాత ఆ ప్యాకెట్లను రీప్యాక్ చేసిన వాటిని కంటెయినర్‌లో అధికారులు సీల్ వేశారు. కంటైనర్ టెర్మినల్‌లోని ఎగ్జామినేషన్ పాయింట్ లో భద్రపరచి అల్ వెదర్ ప్రూఫ్ జోన్‌లో సీబీఐ భద్ర పరిచింది. డ్రగ్స్ అవశేషాలు వాతావరణ ప్రభావానికి దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.
బస్సును కంపెనీకి అప్పగించిన పోలీసులు
విశాఖ డ్రగ్స్ కేసులో సంధ్య ఆక్వా పరిశ్రమలకు సంబంధం ఉందని నేపథ్యంలో మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వా పరిశ్రమలో నాలుగు రోజుల పాటు సీబీఐ దాడులు నిర్వహించిన విషయం తెలిందే.. అంతా సజావుగా ఉంది అనుకునే సమయంలో కొత్త మూలపేట ఎస్‌ఈజెడ్ కాలనీలో సంధ్య ఆక్వాకు చెందిన బస్సు కొన్ని రోజులుగా నిలిపివేసి ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బస్సు ఉన్న ప్రదేశానికి చేరుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. మూలపేటలో సంధ్య అక్వాకు చెందిన బస్సును కంపెనీ సిబ్బందికే పోలీసులు అప్పగించడం గమనార్హం. మొదటి సీబిఐ అధికారులకు అప్పగిస్తామని చెప్పిన పోలీసులు.. అలా చేయలేదు. సీబీఐకి పోలీసులు ఏం సమాధానం చెప్తారు అనే విషయంలో క్లారిటీ లేదు.
తాజావార్తలు
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
ట్రెండింగ్
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?