ఉక్రెయిన్‌పై రష్యా దాడుల కారణంగా అన్ని దేశాల స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే అతి పెద్ద ఐపీవోకు లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా సిద్ధం కాగా.. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను వాయిదా వేసింది. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసీ ఐపీవోను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఐపీవోను వాయిదా వేసేందుకు ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులు, ఇతర అధికారులు చర్యలు చేపడుతున్నారు.
యాంకర్ పెట్టుబడిదారులతో ఎల్‌ఐసీ అండర్ రైటర్లు నిర్వహించిన సమావేశంలో పెద్దగా స్పందన రాలేదని తెలుస్తోంది. పెట్టుబడి పెట్టే విషయంలో చాలా మ్యుచువల్ ఫండ్లకు సంబంధించిన మ్యానేజర్లు స్పష్టమైన హామీని ఇవ్వలేదని సమాచారం అందుతోంది. యుద్ధం వల్ల మార్కెట్లో వచ్చిన మార్పులకు ఎల్ఐసీ ఐపీవో భారీగా ప్రభావితం కానుంది. ఈ ఐపీవో నుంచి భారీగా సొమ్మును మదుపర్ల నుంచి మెుబిలైజ్ చేయాలని భావించడంతో దానిని బడ్జెట్‌లోని డెఫిసిట్‌కు వినియోగించాలని ప్లాన్ చేయటంతో ప్రభుత్వం దీనిపై ఆచితూచి ముందుకు వెళ్లవచ్చని తెలుస్తోంది.