ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీలు శాంసంగ్, వన్‌ప్లస్ వినియోగదారులకు క్షమాపణలు చెప్పాయి. స్మార్ట్ ఫోన్‌లలో యాప్ థ్రాట్లింగ్ జరుగుతుండటంపై సదరు కంపెనీలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఫోన్‌లలో గేమింగ్ పర్ఫార్మెన్స్ పెంచడడం కోసం సదరు సంస్థలు ప్లే స్టోర్‌లలోనే వివిధ యాప్‌ల పనితీరు సామర్థ్యాన్ని తగ్గించి చూపెడుతున్నాయి. దీంతో బ్యాటరీ లైఫ్‌ను పెంచడంతో పాటు గేమ్‌లకు అనువుగా సాఫ్ట్‌వేర్‌ను మరింత శక్తివంతంగా మారుస్తున్నాయి.
ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22తో పాటు గెలాక్సీ ట్యాబ్ ఎస్ 8 సిరీస్‌లలో యాప్‌లు బాగా నెమ్మదిగా స్పందిస్తున్నాయి. యాప్‌ల పనితీరు మందగించడంతో శాంసంగ్, వన్ ప్లస్ సంస్థల యాజమాన్యం స్పందించాయి. ముఖ్యంగ్ శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 సిరీస్‌లో గేమ్ ఆప్టిమైజేషన్ సాఫ్ట్‌వేర్ ఇన్‌బిల్ట్‌గా వస్తోంది. దీంతో వాట్సాప్, ఫేస్‌బుక్, గూగుల్ క్రోమ్, నెట్‌ఫ్లిక్స్, జూమ్ వంటి పలు యాప్‌లను యాప్ థ్రాట్లింగ్ జాబితాలో శాంసంగ్ కంపెనీ చేర్చింది. యాప్‌ల పనితీరు మెరుగుపర్చేందుకు త్వరలో కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ తీసుకొస్తున్నామని, గేమ్ లాంచర్ యాప్‌లో గేమ్ బూస్టర్ ల్యాబ్ అనే ఆప్షన్‌ను తీసుకువస్తున్నట్లు శాంసంగ్ తెలిపింది. అటు వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో ఫోన్‌లలో ఇదే సమస్య యూజర్లను వేధిస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఆక్సిజన్ ఓఎస్ 12ఓ ఆప్టిమైజ్డ్ మోడ్‌ను తీసుకువస్తున్నట్లు వన్‌ప్లస్ కంపెనీ ప్రకటించింది.