మంచి మైలేజీ కారణంగా మారుతి కార్లకు మార్కెట్లో డిమాండ్ ఉంది. అంతేకాకుండా.. వాటి నిర్వహణ, సరసమైన ధర కూడా బలమైన డిమాండ్కు పెద్ద కారణం. ఇప్పుడు కంపెనీ తన కస్టమర్ల సంఖ్యను పెంచుకోవడానికి ఐదు కొత్త మోడళ్లపై దృష్టి సారించింది.
ప్రపంచవ్యాప్తంగా 'డైమండ్' ఇప్పటికీ సంపదకు చిహ్నంగా పరిగణించబడుతుంది. కానీ.. ప్రస్తుతం ఈ రిచ్ బిజినెస్ తీవ్ర 'పేదరికం'లో సాగుతోంది. ఏకంగా 7 వేల కంపెనీలు నష్టాలను చవిచూడగా.. వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదంలో పడే పరిస్థితి నెలకొంది.
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన బిల్ గేట్స్ తన కల గురించి చెప్పారు. సీఎన్బీసీ (CNBC) మేక్ ఇట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. బిల్ గేట్స్ తన కంపెనీ మైక్రోసాఫ్ట్ విజయ రహస్యం ఏమిటో చెప్పారు. తన కెరీర్కు సంబంధించిన మరికొన్ని విషయాలను కూడా పంచుకున్నారు. తన కలలను నెరవేర్చుకోవడానికి కళాశాల విద్యను మధ్యలో ఆపేసిన వ్యాపారవేత్తలలో బిల్ గేట్స్ ఒకరు. అయితే.. ఈ జాబితాలో ఆపిల్ యొక్క స్టీవ్ జాబ్స్, మెటా యొక్క…
అమెరికాలోని తాజా గణాంకాల ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే వారం జరిగే పాలసీ సమావేశంలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉంది.
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ ఉత్పత్తులకు ముఖ్యంగా ఐఫోన్ కు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ పెరుగుతోంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ కంపెనీకి చెందిన ఫోన్లు ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయి.
Cognizant: టెక్ సంస్థ కాగ్నిజెంట్ భారత్లోని తన ప్రధాన కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టింది. చెన్నైలోని ఒక్కియం తొరాయ్పక్కంలోని ఈ బిల్డింగ్ ను దాదాపు 20 ఏళ్లుగా ఆ సంస్థ హెడ్ ఆఫీస్గా ఉపయోగిస్తుంది. ఐటీ కారిడార్లోని దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నాలుగు లక్షల చదరపు అడుగుల ఈ కార్యాలయం విలువ కనీసం 750 - 800 కోట్ల రూపాయల మధ్య ఉంటుందని రియల్ ఎస్టేట్ సంస్థల అంచనా వేస్తున్నాయి.
ప్రపంచంలోని అత్యంత సంపన్నుల గురించి మాట్లాడినప్పుడల్లా ఎలాన్ మస్క్, జెఫ్ బోజెస్, ముఖేష్ అంబానీ తదితరుల పేర్లు తెరపైకి వస్తాయి. వారు ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరు అనడంలో సందేహం లేదు. అయితే వీరంతా పురుషులే. ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళ ఎవరో తెలుసా? ఈ మహిళ పేరు ఆలిస్ వాల్టన్. 74 ఏళ్ల ఆలిస్ వాల్టన్ ఒక పెద్ద అమెరికన్ వ్యాపార మహిళ. ఆమె వాల్మార్ట్ వ్యవస్థాపకుడు సామ్ వాల్టన్ కుమార్తె.