దేశీయ స్టాక్ మార్కెట్‌లో రెండు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లోని మిశ్రమ సంకేతాలు మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. దీంతో బుధవారం సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. తీవ్ర ఒడుదుడుకులు ఎదురవ్వడంతో చివరిదాకా నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 426 పాయింట్లు నష్టపోయి 79, 942 దగ్గర ముగియగా.. నిఫ్టీ 126 పాయింట్లు నష్టపోయి 24, 340 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ. 84.08 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Darshan Bail: దర్శన్ కి బెయిల్.. రేణుకాస్వామి తండ్రి షాకింగ్ స్టేట్మెంట్
నిఫ్టీలో సిప్లా, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్‌డిఎఫ్‌సీ లైఫ్, ట్రెంట్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ భారీ నష్టాలు చవిచూడగా.. అదానీ ఎంటర్‌ప్రైజెస్, టాటా కన్స్యూమర్, హీరో మోటోకార్ప్, బ్రిటానియా ఇండస్ట్రీస్, మారుతీ సుజుకీ లాభపడ్డాయి. సెక్టోరల్‌లో ఎఫ్‌ఎంసిజి, క్యాపిటల్ గూడ్స్ మరియు మీడియా 0.5-2 శాతం ఎగబాకగా, బ్యాంక్, ఫార్మా, ఐటి 1 శాతం చొప్పున క్షీణించాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగియగా.. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.5 శాతం పెరిగింది.
ఇది కూడా చదవండి: UP Crime: మత్తు ఇంజెక్షన్ ఇచ్చి మైనర్ బాలికపై జిమ్ ట్రైన్ అత్యాచారం..