దేశీయ స్టాక్ మార్కెట్‌లో లాభాల జోరు సాగుతోంది. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలతో మంగళవారం ఉదయం సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమై నష్టాల్లోకి జారుకున్నాయి. అనంతరం క్రమక్రమంగా లాభాల బాటపట్టాయి. ఇక ముగింపులో సెన్సె్క్స్ 363 పాయింట్లు లాభపడి 80, 369 దగ్గర ముగియగా.. నిఫ్టీ 127 పాయింట్లు లాభపడి 24, 466 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.84.07 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Ram Pothineni: మహేష్ బాబుతో రామ్ పోతినేని.. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే?
నిఫ్టీలో ఎస్‌బీఐ, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఐసీఐసీఐ బ్యాంక్ భారీ లాభాల్లో కొనసాగగా.. టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో నష్టపోయాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.7 శాతం చొప్పున పెరిగాయి. సెక్టోరల్‌లో బ్యాంక్, రియాల్టీ, పవర్, క్యాపిటల్ గూడ్స్ 1-2 శాతం ఎగబాకగా, ఫార్మా, ఐటీ, ఆటో 0.5-1 శాతం నీరసించాయి.
ఇది కూడా చదవండి: Hyderabad: పోలీసుల అదుపులో సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్..