బియ్యం ఎగుమతులపై విధించిన చాలా పరిమితులను భారత్ తొలగించింది. 2023లో ఈ ఆంక్షలు విధించారు. రుతుపవనాలు బాగా ఉండడం, ప్రభుత్వ గోదాముల్లో సరిపడా బియ్యం నిల్వ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
బుక్‌మైషో సీఈవో, సహ వ్యవస్థాపకుడు ఆశిష్ హేమ్రజనీకి ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. "బుక్ మై షో" అనేది ఆన్లైన్లో టిక్కెట్లు విక్రయించే ప్లాట్‌ఫాం.
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మైంత్రా తదితర ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఫెస్టివల్ సీజన్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. చాలా మంది తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య నష్టాల్లో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ శుక్రవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ముగింపులో మాత్రం సూచీలు నష్టాల్లో ముగిశాయి.
దుబాయ్‌కి చెందిన ఓ వ్యాపారవేత్త ఐదు కోట్ల డాలర్లు అంటే దాదాపు రూ. 418 కోట్లుకు ఓ ప్రైవేట్ ఐలాండ్‌ను కొనుగోలు చేశాడు. దీనికి కారణం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది.
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనాలో ప్రస్తుతం పరిస్థితి దిగజారుతోంది. 2008 తరహా మాంద్యం యొక్క లక్షణాలు దేశంలో కనిపించడం ప్రారంభించాయి.
దక్షిణ కొరియా సంస్థ శాంసంగ్‌కు చెందిన తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ ప్లాంట్‌లో గత 17 రోజులుగా ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. సమ్మె చేస్తున్న ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తామని కంపెనీ హెచ్చరించింది.
UPI : నేడు దేశంలో ప్రతి రెండవ వ్యక్తి UPIని ఉపయోగిస్తున్నారు. యూపీఐ దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా దూసుకుపోతోంది. చాలా దేశాలు భారతదేశ డిజిటల్ చెల్లింపు వ్యవస్థ UPIని ఉపయోగిస్తున్నాయి.
ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ. ప్రపంచంలో అత్యధిక వేతనం పొందుతున్న కొద్దిమంది ఎగ్జిక్యూటివ్‌లలో ఆయన కూడా ఉన్నారు. ఆయన వార్షిక ప్యాకేజీ దాదాపు రూ.165 కోట్లు.
అనిల్ అంబానీ కుమారుడు అన్మోల్ అంబానీపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కోటి రూపాయల జరిమానా విధించింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌కు రుణం ఇచ్చే విషయంలో అన్మోల్ నిబంధనలను పాటించలేదని సెబీ చెబుతోంది.