గత వారం ముగింపులో స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. ఈ వారం ప్రారంభంలో కూడా అదే విధానం కొనసాగింది. ఇక కొత్త వైరస్ ప్రభావం, అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న మిశ్రమ సంకేతాల కారణంగా సోమవారం భారీ నష్టాలను చవిచూసింది. ఏకంగా రూ.12 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. మంగళవారం కూడా అదే ప్రభావం ఉంటుందని మార్కెట్ వర్గాలు భావించాయి గానీ.. అందుకు భిన్నంగా ఉదయం నుంచి సూచీలు లాభాలతో ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 234 పాయింట్లు లాభపడి 78, 199 దగ్గర ముగియగా.. నిఫ్టీ 91 పాయింట్లు లాభపడి 23, 707 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.85.72 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Alleti Maheshwar Reddy : బీజేపీ కార్యాలయంపై పెద్ద దాడిని ఖండిస్తున్నా
నిఫ్టీలో ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా మోటార్స్, హెడ్‌డీఎఫ్‌సీ లైఫ్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ అత్యధికంగా లాభపడగా. హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఐషర్ మోటార్స్, హీరో మోటోకార్ప్, ట్రెంట్ నష్టపోయాయి. ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు చమురు అండ్ గ్యాస్, ఇంధనం, బ్యాంక్, మెటల్ మరియు ఫార్మా 0.5-1 శాతం పెరిగాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం పెరిగింది. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.7 శాతం పెరిగింది.
ఇది కూడా చదవండి: Chinese Manjha: యువకుడి ప్రాణం తీసిన చైనీస్ మాంజా.. గొంతు కోయడంతో మృతి..