India Bangladesh: షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా భారత వ్యతిరేకత పెరుగుతోంది. ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉన్న మహ్మద్ యూనస్ భారత్‌తో మెరుగైన సంబంధాలు కోరుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఆయన సర్కార్‌లోని విద్యార్థి నేతలు, జమాతే ఇస్లామీ, బీఎన్పీ పార్టీలకు చెందిన నేతలు మతోన్మాద వ్యాఖ్యలు చేస్తూ, అక్కడి ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. హిందువులు, భారత్‌కి వ్యతిరేకంగా ప్రజల్లో విషబీజాలు నాటుతున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ తనకు…
India-Bangladesh: షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ అతి చేస్తోంది. ముఖ్యంగా తన స్థాయి ఏమిటో మరిచిపోయి భారత్‌కి వార్నింగ్ ఇస్తోంది. అక్కడి జమాతే ఇస్లామీ, అన్సరుల్లా బంగ్లా టీమ్ వంటి మతోన్మాద, తీవ్రవాద సంస్థలు భారత దేశాన్ని బెదిరించేలా ప్రకటనలు చేస్తున్నాయి.
Terrorist Attack: 2025 జనవరి 25న, జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో గణతంత్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందు ఉగ్రవాద ఘటన చోటుచేసుకుంది. బిల్వార్ ప్రాంతంలోని భటోడి, మువార్ ప్రాంతంలోని ఆర్మీ క్యాంపుపై అర్థరాత్రి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అయితే, సైన్యం ఎదుకాల్పులు చేసింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో సైన్యం చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ సంఘటనతో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) అదనపు డైరెక్టర్ జనరల్…
India-Bangladesh Border: షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రస్తుతం మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత వ్యతిరేక విధానాలను అవలంభిస్తోంది. ముఖ్యం పాకిస్తాన్‌తో సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. మరోవైపు ఆ దేశంలోని మైనారిటీలు, ప్రధానం హిందువులను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారు. ఇక బంగ్లా మాజీ ఆర్మీ అధికారులు భారత్‌కి వార్నింగ్ ఇచ్చే స్థాయికి ఎదిగారు. Read Also: Rahul Gandhi:…
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లా నౌషేరా భవానీ సెక్టార్ వద్ద ల్యాండ్ మైన్ పేలింది. భారత్-పాక్ సరిహద్దు నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద మంగళవారం ప్రమాదవశాత్తు జరిగిన పేలుడులో ఆరుగురు భారత జవాన్లు గాయపడ్డారు. సాధారణ గస్తీలో భాగంగా జవాన్లు ఆ ప్రాంతం గుండా వెళ్తున్న క్రమంలో అనుకోకుండా మందుపాతర పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. Read Also: Adam Gilchrist: ‘బ్యాటింగ్‌పై దృష్టి పెట్టు.. జుట్టు మీద కాదు’.. భారత్ బ్యాటర్ పై కీలక…
భారత్‌లోని పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలతో బంగ్లాదేశ్ 4 వేల కిలో మీటర్ల సరిహద్దును కలిగి ఉంది. గంగ, బ్రహ్మపుత్ర, సుందర్బన్‌లకు 53 కంటే ఎక్కువ చిన్న నదులు, వాగులు సరిహద్దులుగా కొనసాగుతున్నాయి. ఇక, నీటి పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుండటంతో.. 24 గంటలూ ఆ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టినట్లు బీఎస్‌ఎఫ్ వర్గాలు చెప్పాయి.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్)పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాక్యలు చేశారు. రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు బీఎస్ఎఫ్ బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను అనుమతిస్తుందని గురువారం ఆరోపించారు. ఈ ఆరోపణలు పెద్ద దుమారానికి కారణమయ్యాయి. ఈ ప్లాన్ కేంద్రం యొక్క ‘‘నీచమైన బ్లూ ప్రింట్’’ అని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న బీఎస్ఎఫ్ బెంగాల్‌లోకి చొరబాట్లను అనుమతిస్తోందని, మహిళలను హింసిస్తోందని ఆరోపించారు. ‘‘బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు’’ బెంగాల్‌లో శాంతికి విఘాతం కలిగిస్తున్నాయని కొన్ని రోజుల క్రితం కేంద్ర…
Bandi Sanjay : హకీం పేట్ లోని నిసా కేంద్రంలో రోజ్ గార్ మేళా లో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్. 340 మందికి నియామక పత్రాలను బండి సంజయ్ అందజేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. దేశ యువత సాధికారత లక్ష్యంగా ఉద్యోగ కల్పన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అంకితభావం, పారదర్శకతతో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు.…
Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులపై అకృత్యాలు ఆడగం లేదు. ముఖ్యంగా ఇస్కాన్ సంస్థను టార్గెట్ చేస్తు్న్నారు. ఇప్పటికే ఈ సంస్థలో సంబంధం ఉన్న ప్రముఖ హిందూ నేత చిన్మోయ్ కృష్ణదాస్‌ని, మరికొందరు హిందూ మత గురువుల్ని అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. చిన్మోయ్ తరుపున వాదించే లాయర్లను కూడా అక్కడి ఇస్లామిస్ట్ రాడికల్స్ బెదిరిస్తు్న్నారు.