Jammu Kashmir: భారత్-పాక్ సరిహద్దుల్లో మందుపాతర పేలుడు..ఆరుగురు జవాన్లకు గాయాలు..
- భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో మందుపాతర పేలుడు..
- ఎల్ఓసీ వద్ద ప్రమాదవశాత్తు పేలుడు..
- ఆరుగురు జవాన్లకు స్వల్ప గాయాలు..
- రాజౌరీ జిల్లా నౌషేరా భవానీ సెక్టార్‌లో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లా నౌషేరా భవానీ సెక్టార్ వద్ద ల్యాండ్ మైన్ పేలింది. భారత్-పాక్ సరిహద్దు నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద మంగళవారం ప్రమాదవశాత్తు జరిగిన పేలుడులో ఆరుగురు భారత జవాన్లు గాయపడ్డారు. సాధారణ గస్తీలో భాగంగా జవాన్లు ఆ ప్రాంతం గుండా వెళ్తున్న క్రమంలో అనుకోకుండా మందుపాతర పేలడంతో ఈ ప్రమాదం జరిగింది.
Read Also: Adam Gilchrist: ‘బ్యాటింగ్‌పై దృష్టి పెట్టు.. జుట్టు మీద కాదు’.. భారత్ బ్యాటర్ పై కీలక వ్యాఖ్యలు
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
సైనిక వర్గాల ప్రకారం.. సైనికులు సున్నితమైన ప్రాంతాల్లో తమ గస్తీని నిర్వహిస్తుండగా, అందులో ఒకరు పొరపాటున మందుపాతరపై కాలు వేయడంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా ఆరుగురు సైనికులకు స్వల్ప గాయాలయ్యాయి. వారికి వెంటనే వైద్య సహాయం అందించారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. గాయపడిన వారి పరిస్థితి బాగానే ఉందని, తదుపరి వైద్య కోసం సైనికులను సమీపంలోని వైద్య కేంద్రానికి తరలించారు.
గతంలో అనేక ఘర్షణలకు ఈ నౌషేరా సెక్టార్ కేంద్రంగా ఉంది. ఉగ్రవాదులు సరిహద్దు కంచెను దాటి రావడం, పాకిస్తాన్ బలగాల కాల్పులు కారణంగా ఎల్‌ఓసీ సమీపంలోని ఈ ప్రాంతం హై-సెక్యూరిటీ జోన్‌గా ఉంది. సరిహద్దు భద్రతా చర్యల్లో భాగంగా మందుపాతరలను అమర్చుతారు. అనుకోకుండా గస్తీ సమయంలో వీటిపై కాలు వేయడంతో తాజా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనపై ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి, ఈ ప్రాంతంలో సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి సైన్యం దర్యాప్తు చేస్తోంది. ఈ ప్రాంతంలో భద్రతను పెంచడంతో పాటు అదనపు ముందు జాగ్రత్త చర్యల్ని తీసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!