Terrorist Attack: 2025 జనవరి 25న, జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో గణతంత్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందు ఉగ్రవాద ఘటన చోటుచేసుకుంది. బిల్వార్ ప్రాంతంలోని భటోడి, మువార్ ప్రాంతంలోని ఆర్మీ క్యాంపుపై అర్థరాత్రి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అయితే, సైన్యం ఎదుకాల్పులు చేసింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో సైన్యం చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ సంఘటనతో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) అదనపు డైరెక్టర్ జనరల్ (ADG) సతీష్ ఎస్. జమ్మూ కాశ్మీర్‌లోని కతువా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దులో భద్రతా పరిస్థితిని సమీక్షించారు. శుక్రవారం (జనవరి 24, 2025) ఆయన ఫీల్డ్ కమాండర్లతో భద్రతా ముసాయిదా అంశాలపై చర్చించి, సైనికులతో సమావేశమయ్యారు.
Also Read: Hyderabad: బంజారాహిల్స్‌లో రోడ్డు ప్రమాదం.. నిందితుడు షార్ట్ ఫిలిం దర్శకుడిగా గుర్తింపు
గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేయడంపై దృష్టి సారించారు. గత కొన్ని రోజులుగా, పుల్వామా జిల్లాలో జరిగిన సెర్చ్ ఆపరేషన్‌లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల స్థావరాన్ని ఛేదించి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఘటనలు గణతంత్ర దినోత్సవ వేడుకల ముందు భద్రతకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలను చూపిస్తున్నాయి.
Also Read: Phone Tapping Case: గవర్నర్ ఇంద్రసేన రెడ్డి ఫోన్ ట్యాపింగ్.. బీజేపీ సీరియస్