Drugs Seized : పశ్చిమ బెంగాల్‌లోని భారతదేశం-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. నాడియా జిల్లాలోని కిషన్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మఝరియా పట్టణంలోని నఘాటా ప్రాంతంలో సరిహద్దు భద్రతా దళం (BSF) దక్షిణ బెంగాల్ సరిహద్దుకు చెందిన 32వ బెటాలియన్ మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకుంది. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా బెటాలియన్ ఒక పెద్ద ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో మూడు అండర్ గ్రౌండ్ స్టోరేజీ ట్యాంకుల నుండి 62,200 బాటిళ్ల ఫెన్సెడైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ట్యాంకర్లలో ఉంచిన బాటిళ్ల విలువ కోటి రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. అంటే ఈ బాటిళ్ల ధర దాదాపు రూ.1,40,58,444. ఇంత భారీ స్థాయిలో ఫెన్సెడైల్ స్వాధీనం చేసుకోవడం ఈ ప్రాంతంలో అక్రమ రవాణా ప్రయత్నాలకు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.
Read Also:Hamas: నలుగురు ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టిన హమాస్.. మీడియా ఎదుట చిరునవ్వులు
ఎలా పట్టుకున్నారంటే ?
జనవరి 24, 2025న నిఘా సమాచారం అందింది. దీని ఆధారంగా 32 బెటాలియన్ బీఎస్ఎఫ్ సౌత్ బెంగాల్ ఫ్రాంటియర్‌కు చెందిన బోర్డర్ అవుట్‌పోస్ట్ తుంగి సిబ్బంది మధ్యాహ్నం 02.45 గంటలకు నాడియా జిల్లాలోని మజ్హారియా పట్టణం పరిధిలోని నఘాటా ప్రాంతంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ స్టోరేజీ ట్యాంకులను రెండు దట్టమైన వృక్షాల కింద నిర్మించారు. ఒక స్టోరేజీ ట్యాంక్ CGI షీట్లతో చేసిన గుడిసె కింద నిర్మించారు. ఈ స్టోరేజీ ట్యాంకుల నుండి ఫెన్సెడైల్ బాటిళ్లతో నిండిన పెట్టెలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 62,200 ఫెన్సెడైల్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంత భారీ మొత్తంలో ఫెన్సెడైల్ రవాణా అధికారులను పూర్తిగా ఆశ్చర్యపరిచింది.
ఇంత పెద్ద మొత్తంలో ఫెన్సెడైల్‌ను విజయవంతంగా స్వాధీనం చేసుకోవడంతో ఈ ప్రాంతంలో చురుగ్గా ఉన్న స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ల గురించి సమాచారం అందింది. స్వాధీనం చేసుకున్న ఫెన్సెడైల్ సరుకును తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత విభాగానికి అప్పగించారు. ఈ ముఖ్యమైన ఆపరేషన్‌ను బిఎస్‌ఎఫ్ సౌత్ బెంగాల్ ఫ్రాంటియర్ ప్రతినిధి ప్రశంసించారు. ఈ విజయం సరిహద్దు భద్రతా దళ జవాన్ల అప్రమత్తత, ధైర్యం, నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. ఈ పెద్ద స్మగ్లర్ల నెట్‌వర్క్ గురించి మరింత సమాచారం సేకరిస్తున్నామని, ఇది భవిష్యత్తులో మరిన్ని పెద్ద విషయాలు బయటపడటానికి అవకాశం అని ఆయన అన్నారు.