India- Bangladesh: బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రధాన మంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య సంబంధాలు క్రమంగా బలహీన పడుతున్నాయి. ఆ తర్వాత అక్కడ హిందువులపై కొనసాగుతున్న దాడులతో ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ సర్కార్ తో భారత్‌కు దూరం పెరుగుతుంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ జల సరిహద్దులపై భారత సరిహద్దు భద్రతా దళం నిఘా కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు.
Read Also: Kubera : మరోసారి వాయిదా పడిన శేఖర్ కమ్ముల ‘కుబేర’ ?
అయితే, భారత్‌లోని పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలతో బంగ్లాదేశ్ 4 వేల కిలో మీటర్ల సరిహద్దును కలిగి ఉంది. గంగ, బ్రహ్మపుత్ర, సుందర్బన్‌లకు 53 కంటే ఎక్కువ చిన్న నదులు, వాగులు సరిహద్దులుగా కొనసాగుతున్నాయి. ఇక, నీటి పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుండటంతో.. 24 గంటలూ ఆ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టినట్లు బీఎస్‌ఎఫ్ వర్గాలు చెప్పాయి. వీటి కోసం ఈస్ట్రన్ కమాండ్ కొత్తగా తేలియాడే సరిహద్దు ఔట్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇవి జల సరిహద్దుల్లో గస్తీ నిర్వహణకు తమకు సహకరిస్తాయని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.
Read Also: Jasprit Bumrah: టీమిండియాకు షాక్.. ఆట మధ్యలోనే మైదానం వీడిన బుమ్రా.. కోహ్లీకి కెప్టెన్సీ బాధ్యతలు
కాగా, 1970కి ముందు పాకిస్థాన్‌కు చెందిన టెర్రరిస్టులు బెంగాల్ జలాల ద్వారా జమ్మూకశ్మీర్‌లోకి ప్రవేశించేవారని.. ప్రస్తుతం అక్కడి సర్కార్ మారడంతో మళ్లీ పాక్ ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించే ఛాన్స్ ఉండొచ్చని ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు చెప్పారు. దీంతో గత పది రోజుల్లో బెంగాల్ సరిహద్దు జలాల ద్వారా దేశంలోకి ముగ్గురు ఉగ్రవాదులు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకున్నట్లు బీఎస్‌ఎఫ్ వర్గాలు వెల్లడించారు. టెర్రరిస్టులు దేశంలోకి చొరబడడానికి నీటి మార్గాలను ఎంచుకోవడంతో జల సరిహద్దులపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.