సైన్యంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) అనేక గ్రూప్ B, గ్రూప్ C పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. BSF ఈ రిక్రూట్‌మెంట్ కోసం 10th, 12th పాస్ అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది.
Punjab: పంజాబ్‌లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సమయంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా బీఎస్ఎఫ్ పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి 60 డ్రోన్‌లను జారవిడిచింది. ఎన్నికల సమయంలో పంజాబ్‌లో గత 83 రోజుల్లో పట్టుబడిన డ్రోన్‌ల సంఖ్య మొత్తం పంజాబ్‌లో ఇప్పటి వరకు అత్యధికం.
అజిత్ దోవల్ పేరును అందరికీ సుపరిచితమే. 2014 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైనిక అనుభవజ్ఞులు, నాయకులు కూడా భారతదేశ జాతీయ భద్రతా సలహాదారుగా అతడిని ప్రశంసించడం ప్రారంభించారు. తాజాగా ఓ కార్యక్రమంలో అజిత్ దోవల్ ఇజ్రాయెల్ పై ప్రశంసలు కురిపించారు.
సీఏపీఎఫ్ (కేంద్ర సాయుధ బలగాల) లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు తాజాగా యూపీఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 506 పోస్టుల భర్తీకి యూపీఎస్సి సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ పరీక్షను నిర్వహించనుంది. ఈ పరీక్షలో భాగంగా బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ చొప్పున అసిస్టెంట్ కమాండెంట్ల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. వీటి కోసం మే 14 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులను చేసుకోవచ్చు. Also read:…
ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మావోల సంఖ్య 29కి చేరింది. ఛోట్‌బెటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బినాగుండా, కరోనార్ మధ్య హపటోలా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో.. పోలీసులు, నక్సలైట్ల మధ్య భీకర కాల్పులు జరగగా.. 29 మంది నక్సలైట్లు మరణించినట్లు సమాచారం తెలుస్తోంది. ఈ ఎన్ కౌంటర్ లో 25 లక్షల రివార్డు ఉన్న నక్సలైట్ కమాండర్ శంకర్…
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లోని సున్నితమైన పాయింట్లను మ్యాపింగ్ చేయడంతో పాటు.. డ్రోన్‌ల కదలికలు, డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణాను తనిఖీ చేయడానికి ఏజెన్సీ ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని (SOP) సిద్ధం చేసినట్లు సరిహద్దు భద్రతా దళం (BSF) అధికారులు తెలిపారు. చండీగఢ్‌లో బీఎస్‌ఎఫ్ వెస్ట్రన్ కమాండ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా మాట్లాడుతూ.. భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో డ్రోన్‌ల కదలికలను బీఎస్‌ఎఫ్ పర్యవేక్షిస్తోందని, గత ఏడాది కాలంలో 95 డ్రోన్‌లను కూల్చివేసినట్లు తెలిపారు.
Jammu Kashmir: జమ్మూలోని అర్నియా సెక్టార్లో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) పోస్ట్‌పై గురువారం రాత్రి పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరిపింది.
Honey Trap: భారతదేశ రహస్యాలను తెలుసుకోవడానికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హనీట్రాప్ ని ఉపయోగిస్తున్నాయి. ఇప్పటికే డీఆర్డీఓలో పనిచేస్తున్న ఓ సైంటిస్టు సున్నితమైన భారత మిస్సైల్ రహస్యాలను ఓ పాకిస్తాన్ మహిళా ఏజెంట్ లో పంచుకున్నారు. అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్న సమయంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా మరో హనీట్రాప్ కేసు వెలుగులోకి వచ్చింది.