పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులు వేగవంతానికి చర్యలు చేపట్టి 2027 మార్చి నాటికి ఉదండాపూర్ వరకు నీరు అందిస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రాజెక్టుల కోసం భూ సేకరణకు సత్వర చర్యలకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నాం.. పాలమూరు జిల్లా గత బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైంది అని ఆరోపించారు.
ప్రధాని సభకు రావాలంటూ జగన్కు ఆహ్వానపత్రిక.. పీఏకు ఇచ్చి వెళ్లిన అధికారులు అమరావతిలో శుక్రవారం రాజధాని నిర్మాణ పనులు పున:ప్రారంభం కాబోతున్నాయి. ప్రధాని మోడీ చేతుల మీదుగా పనులు ప్రారంభం కానున్నాయి. అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఇక రాష్ట్రంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపించింది. ఇందులో భాగంగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ను కూడా ఆహ్వానించింది. శుక్రవారం జరిగే ప్రధాని మోడీ సభకు రావాలంటూ తాడేపల్లిలోని…
పాకిస్తాన్ ఆలోచనల ప్రకారం కాంగ్రెస్ వ్యవహరిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతను మరిచి ప్రధానమంత్రిని కించపరిచేలా సోషల్ మీడియా పోస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. దాయాది దేశంతో యుద్ధమేఘాలు కమ్ముకున్న సమయంలో.. బాధ్యతాయుత ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన కాంగ్రెస్ పార్టీ.. అన్ని విలువలకు తిలోదకాలిచ్చింది. పాకిస్తాన్, ఉగ్రవాదులు మాట్లాడుతున్న భాషలో.. మాట్లాడుతోంది. పాకిస్తాన్ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నేతల ఆలోచన ఒకే రకంగా ఉందని అర్థమవుతోందన్నారు. Also Read:Pahalgam Terror Attack: పహల్గామ్…
ఎన్డీఎస్ఏ నివేదికపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఘటనపై ఒక భాద్యత గల పౌరునిగా మాట్లాడుతున్న.. గత ప్రభుత్వ కక్కుర్తి వల్ల చాలా నష్టం జరిగింది.. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిరంతరం అసత్యాలు, అబద్ధాలు ప్రచారం చేసుకున్నారు.. తుమ్మిడిహెట్టి దగ్గర 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు రూ. 38 వేల కోట్లతో నాటి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.. కొంత పని కూడా…
EX Minister Jagadish Reddy: ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభపై ప్రజల్లో చర్చ జరుగుతోంది అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఇక, సభకు వచ్చిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు.. బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పేరు కేసీఆర్ చెప్పలేదని సీఎం బాధపడుతున్నారు ఎద్దేవా చేశారు.
Jagga Reddy: బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో కేసీఆర్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రైతు రుణమాఫీపై ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ పూర్తి చేశారు.. కాంగ్రెస్ చేసిన రుణమాఫీకి.. కేసీఆర్ చేసిన రుణమాఫీకి తేడా ఉందన్నారు.
Minister Seethakka: బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభలో కేసీఆర్ స్పీచ్ చూసాకా... ఓ నియంత అధికారం పోయాక ప్రజల దగ్గరికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నట్టు ఉంది అని మంత్రి సీతక్క ఎద్దవా చేశారు. బాధ ఎవరి కోసం.. అధికారం పోయిందని బాధ తప్పితే ఇంకేం బాధ అని ప్రశ్నించింది.
Minister Ponguleti: వరంగల్ లో బీఆర్ఎస్ నిర్వహించిన రజతోత్సవ బహిరంగ సభలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ మంచి సూచన ఇస్తారేమో అనుకున్నాం.. కానీ, ఆయన మనసంతా విషం నింపుకున్నాడు అని మండిపడ్డారు.
కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం అని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో కరెంట్ సరఫరా, రైతు బంధు, ధాన్యం కొనుగోళ్లలో, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్ అయిందన్నారు. కానీ, అబద్ధపు వాగ్ధానాలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం, 20-30 శాతం కమీషన్లు తీసుకోవడమే కాంగ్రెస్ పని అని ఆరోపించారు.
కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తున్నారు.. ఇది సాధ్యమా అని అడిగారు. మన సభకు ప్రజలు రాకుండా అనేక ఆటంకాలు సృష్టిస్తున్నారు.. బీఆర్ఎస్ సభల్ని ఆపుతారా.. ఈ ప్రభంజనాన్ని ఎలా ఆపుతారు అని అడిగారు..