భారత్-పాక్ యుద్ధంపై యాంకర్ రష్మీ సంచలన కామెంట్స్!
బుల్లితెర యాంకర్ రష్మీ గురించి పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు దాదాపు చాలా సినిమాలు చేసింది. కానీ అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. కానీ ‘జబర్దస్త్’ కామెడీ షోతో మాత్రం ఫుల్‌గా పాపులర్ అయ్యింది రష్మి గౌతమ్. ఈ షో పేరునే ఇంటి పేరుగా మార్చుకుంది. దాదాపు పదేళ్లుగా ఆమె ఈ షోకి యాంకర్‌గా చేస్తూనే ఉంది. అదే కమిట్‌మెంట్‌తో అలరిస్తూనే ఉంది. ఇదిలా ఉంటే తాజాగా జరుగుతున్న భారత్-పాక్ యుద్ధం యాంకర్ రష్మీ సంచలన కామెంట్స్ చేసింది.
గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. రూ. 1800 తగ్గిన తులం గోల్డ్ ధర
బంగారం ధరలు భారీగా పడిపోయాయి. రెండ్రోజుల క్రితం వరకు పరుగులు పెట్టిన పసిడి ధరలు శాంతించాయి. నేడు తులం గోల్డ్ ధరపై రూ. 1800 తగ్గింది. తగ్గని ధరలు కొనుగోలుదారులకు ఊరటకలిగిస్తున్నాయి. వెండి ధరలు కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి. నేడు కిలో వెండిపై రూ. 2000 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9, 688, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,880 వద్ద ట్రేడ్ అవుతోంది.
భారీ అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన 22 గోదాములు..!
మహారాష్ట్రలోని థానే జిల్లా, భివండీలో ఉన్న రిచ్ ల్యాండ్ కాంపౌండ్ వద్ద సోమవారం ఉదయం (మే 12) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ అగ్నిప్రమాదం పలు కంపెనీల గోదాములను చుట్టుముట్టగా, దాదాపు 22 గోదాములు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ గోదాముల్లో రసాయనాలు, ముద్రణ యంత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆరోగ్యానికి సంబంధించిన ప్రోటీన్ ఫుడ్ పౌడర్లు, కాస్మెటిక్ ఉత్పత్తులు, బట్టలు, షూస్, మండపం అలంకరణ సామగ్రి, ఫర్నిచర్ వంటి వస్తువులు ఉన్నట్లు సమాచారం.
నేడు హిందూపురం మున్సిపల్ వైస్ చైర్మన్-1 జబీవుల్లాపై అవిశ్వాసం!
ఈరోజు హిందూపురం మున్సిపల్ వైస్ చైర్మన్-1 జబీవుల్లాపై అవిశ్వాసం జరగనుంది. ఇప్పటికే అవిశ్వాస తీర్మానంపై సంతకాలతో కలెక్టర్‌కు కౌన్సిలర్లు నోటీసులు ఇచ్చారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పదవీకాలం నాలుగు సంవత్సరాలు పూర్తవడంతో.. అవిశ్వాస తీర్మానికి కౌన్సిలర్లు సిద్దమయ్యారు. జబీవుల్లాపై టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం ఆమోదానికి సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు కౌన్సిల్ హాల్‌లో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. నాలుగేళ్ల పదవీ కాలం ముగియడంతో జబీవుల్లాను పదవి నుంచి తప్పించి.. టీడీపీలో ఉన్న కౌన్సిలర్‌కు వైస్ ఛైర్మన్ పదవి ఇవ్వాలని అధికార పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా జబీవుల్లాపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ.. 23 మంది సభ్యుల సంతకాలతో కలెక్టర్‌కు కౌన్సిలర్లు నోటీసు ఇచ్చారు. దాంతో కలెక్టర్ నేడు మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు ప్రత్యేక అధికారిగా పెనుకొండ ఆర్డీవో ఆనంద్ కుమార్‌ను నియమించారు.
బీజేపీ, బీఆర్‌ఎస్ రెండూ ఒక్కటే.. ఒకరు స్క్రిప్ట్ రాస్తే.. మరొకరు మాట్లాడతారు
ఖమ్మం జిల్లా అభివృద్ధిలో తాము చేపట్టిన కార్యక్రమాల గురించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తావిస్తూ, బీజేపీ-బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రమైన విమర్శలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఒకటే. ఒకరు స్క్రిప్ట్ రాస్తే మరొకరు మాట్లాడతారు అని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షం పాత్ర పోషించడంలో తప్పులేదు. కానీ విమర్శలు చేస్తే వాటికి సోయి ఉండాలి. ప్రజలు అన్నం తినలేదన్నట్టు బిల్డప్ ఇవ్వడం తప్ప మరొకటి కాదు అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మంత్రి.. సీతారామ ప్రాజెక్టుకు కరెంట్ కూడా ఇవ్వలేని స్థితిలో ఉండే ప్రభుత్వం ప్రజల అవసరాలపై ఎంత చిత్తశుద్ధితో పని చేసిందో చెప్పకనే చెప్పింది అని అన్నారు. భూమికి బదులుగా భూమి ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని, కానీ తాత్కాలికంగా నగదు రూపంలో సాయం అందిస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి. రెండు మూడు రోజుల్లో అందరికీ సాయం అందుతుంది. స్థలాలు పోతున్న వారికి పరిహారం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
నిస్వార్ధంగా నర్సులు అందించే సేవలు వెలకట్టలేనివి!
నిస్వార్ధంగా నర్సులు అందించే సేవలు వెలకట్టలేనివి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నర్సుల చేతి స్పర్శ కూడా రోగిలో మానసిక స్థైర్యాన్ని, సాంత్వన కలిగిస్తుందన్నారు. విధి నిర్వహణలో ఎంతో మంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న నర్సుల సేవలను ఎవరూ మరచిపోరు అని ప్రశంసించారు. నర్సుల కష్టంను తాను స్వయంగా చూశానని పవన్ కళ్యాణ్ చెప్పారు. నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులతో డిప్యూటీ సీఎం పవన్ సమావేశం అయ్యారు.
4 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
తెలంగాణలో వాతావరణ పరిణామాలు మారుతున్నాయి. వచ్చే నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనివల్ల కొన్ని జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశముండటంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల ప్రజలు సురక్షితంగా ఉండాలని, అవసరమైతేonly బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు.
విద్యుత్ చార్జీలు పెంచబోము.. వారికే రెడ్ బుక్ వర్తిస్తుంది!
రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచలేదని, పెంచబోమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. కొందరు యాక్సిస్ గ్రూప్ ఫీల్డ్ ఎనర్జీ మీద దుష్ర్పచారం చేశారని, పదే పదే ప్రభుత్వం మీద బురద చల్లే పనులు చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్ తప్పులు శుభ్రం చేయటానికే తమకు టైం సరిపోతుందని, విద్యుత్ శాఖను ఆయన దుర్వినియోగం చేశారన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రాయలసీమ, ప్రకాశం జిల్లా ప్రాంతాల్లో రెనేబుల్ ఎనర్జీకి పెద్దపీట వేశాం అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పుకొచ్చారు.
సీఎం వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి మాట్లాడే భాష, ఆయన ప్రస్తావించిన అంశాలు నీచంగా, బాధకరంగా ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. కవిత వివరించగా, గతంలో కంచ గచ్చిబౌలిలో ప్రభుత్వ భూములను అమ్మి ఆదాయం పొందాలనే ప్రయత్నం ప్రభుత్వం చేసినప్పటికీ అది విఫలమైంది. భవిష్యత్తులో పరిశ్రమల అభివృద్ధి కోసం TG IIC ద్వారా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భూములను సేకరించారని ఆమె తెలిపారు. ఇప్పుడు ఆ భూములపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారని, వాటిని కుదువ పెట్టేందుకు వ్యూహాత్మకంగా చర్యలు తీసుకుంటున్నారని ఆమె ఆరోపించారు.
దేశంలో ఎల్‌నినో తగ్గింది.. అసలు ఎల్‌నినో అంటే..?
భారత వాతావరణ శాఖ (IMD) తాజా ప్రకటన ప్రకారం, దేశాన్ని ప్రభావితం చేసిన ఎల్ నినో పరిస్థితులు తొలిగిపోయాయి. దీని ప్రభావంతో గత ఏడాది పాటు ప్రతీ సీజన్ ఆలస్యంగా మొదలైందీ కాక, సాధారణ దినాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే, ఇప్పుడు ఈ వాతావరణ తారతమ్యం తగ్గిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఎల్ నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని ఈశాన్య భాగంలో సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ కంటే ఎక్కువగా పెరిగే ఒక ప్రకృతి తత్వం. ఇది ప్రపంచ వాతావరణ నమూనాలను ప్రభావితం చేసే శక్తివంతమైన ఘటన. దీనివల్ల ముఖ్యంగా భారత్‌లో, ఇతర ఆసియా దేశాల్లో వర్షాలపై, ఉష్ణోగ్రతలపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది.