తొందర్లోనే స్థానిక ఎన్నికలు వస్తాయని, స్థానిక ఎన్నికల్లో సీరియస్‌గా పోటీ చేస్తాం అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 50 ఏళ్లు మోసపోయాం అని, మళ్లీ మోసపోవద్దని కేసీఆర్ చెప్పారని.. కానీ తాత్కాలికంగా మోసపోయాం అని పేరొన్నారు. ధాన్యం కొనుగోళ్లు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని, రుణమాఫీ కూడా చేయలేకపోయిందని మండిపడ్డారు. రైతుబందు మొదటి పంటకే గతి లేదు అని ఎద్దేవా చేశారు. పేదలకు అండగా నిలిచేది బీఆర్‌ఎస్ మాత్రమే అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
‘పాకిస్థాన్‌తో యుద్ధ వాతావరణం ఉంది, రాజకీయాలు మాట్లాడాల్సిన సమయం కాదు ఇది. ధాన్యం కొనుగోళ్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. రుణమాఫీ కూడా చేయలేకపోయారు. ఒక్క జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు, మన ప్రభుత్వం పోయాక ముగ్గురుకి పదవులు వచ్చాయి. సీతారామ ప్రాజెక్టును కేసీఆర్ నిర్మాణం చేపట్టారు. డిప్యూటీ సీఎం భట్టి మధిరలో గెలవడానికి బాండ్ పేపర్ మీద సంతకాల చేసి నీటికి వచ్చిన వాగ్దానాలు చేశారు. 125 ఏళ్ల చరిత్ర గలిగిన పార్టీ అని భట్టి చెప్పారు.. ఇప్పుడు ఆ హామీలు ఏమయ్యాయి. 17 నెలల తర్వాత వున్న స్కీములు పోయాయి. ఇప్పుడు కేసీఆర్ కిట్ పోయింది. రైతుబందు మొదటి పంటకే గతి లేదు. ఫ్రీ బస్, తులం బంగారం అన్నారు.. ఎటుపోయాయి. ఖమ్మం జిల్లా అంతా మార్పు అన్నారు. ఇప్పుడు ఏమి అయ్యింది’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
‘అయిదేళ్లు మేము ప్రక్కకు ఉంటాము. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చారు. వాటిని మేము వదిలిపెట్టేది లేదు. రేవంత్ రెడ్డి మాదిరిగా ఏ సీఎం కూడా ఇలా మాట్లాడలేదు. ఢిల్లీకి పోతే రేవంత్ రెడ్డిని దొంగల మాదిరిగా చూస్తున్నారు అని అంటున్నారు. నిజమే రేవంత్ రెడ్డి దొంగే కదా. ఓ సీఎం అలా మాట్లాడవచ్చా. రేవంత్ రెడ్డిని చూస్తే కేంద్రం దొంగలా చూస్తోంది. ఒక్క ఓటుకి శిక్ష అయిదేళ్లు. తొందర్లోనే స్థానిక ఎన్నికలు వస్తాయి, సీరియస్‌గా పోటీ చేస్తాం. నాయకులూ ప్రజల్లో ఉండాలి, ధాన్యం కల్లాల వద్ద మనమే ఉండాలి. ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించాం, కాంగ్రెస్ లో చేరారు. భద్రాచలం ఉప ఎన్నిక వస్తుంది, ఉమ్మడి జిల్లా క్యాడర్ భద్రాచలం వెళ్లి గెలిపించుకుందాం. 50 ఏళ్లు మోసపోయాం, మళ్ళీ మోసపోవద్దని కేసీఆర్ చెప్పారు కానీ.. తాత్కాలికంగా మోసపోయాం. పేదలకు అండగా నిలిచేది బీఆర్‌ఎస్ మాత్రమే అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.