కేసీఆర్ సభ పైనా ప్రజల కంటే కాంగ్రెస్ నాయకులకే ఇంట్రెస్ట్ పెరిగింది అని సెటైర్ వేశారు. కేసీఆర్ ఏం మాట్లాడుతారు అని కాంగ్రెస్ నేతలు ఆతృతగా ఎదురు చూస్తున్నారని హరీష్ రావు తెలిపారు.
Komitreddy Venkat Reddy : బీఆర్ఎస్పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నదుల అభివృద్ధి , సంరక్షణ సంస్థ (NDSA) నివేదికలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన డొల్లతనం పూర్తిగా బహిర్గతమైందని తెలిపారు. బీఆర్ఎస్ నేతలకు అబద్ధాలు చెప్పడం తప్ప మరేమీ తెలియదని ఎద్దేవా చేశారు. నివేదిక ఆధారంగా తప్పిదాలపై తప్పకుండా చర్యలు ఉంటాయని హామీ ఇచ్చారు. కాళేశ్వరం ఎనిమిదో వింతే అని వ్యాఖ్యానించిన కోమటిరెడ్డి.. మూడు సంవత్సరాల్లో నిర్మించి, రెండు సంవత్సరాల్లో కూలిపోయే…
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ మాట్లాడుతూ.. “బీఆర్ఎస్ నేతలకు కొద్దిగైన సిగ్గు ఉండాలి.. సిగ్గు పడాలి.. కాళేశ్వరంతో అద్భుతాలు సృష్టిస్తున్నాము అని చెప్పి లక్ష కోట్ల ప్రాజెక్ట్ కట్టారు.. Ndsa నివేదిక చూసి సిగ్గు పడాలి వాళ్ళు.. మీరే డిజైన్ చేశారు.. మీరే కట్టారు.. మేడిగడ్డ సుందిళ్ళ నిరుపయోగంగా ఉన్నా రికార్డు స్థాయిలో పంటలు పండాయి.. అబద్ధాలు తప్పులపై బతకాలి అనుకుంటుంది బీఆర్ఎస్.. అది కుదరదు.. Also Read:Seema…
Jagadish Reddy : కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్డీఎస్ఏ (NDSA) నివేదికను బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఆయన వరంగల్లో జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్ల గురించి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 27న జరగబోయే సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. మేము బీఆర్ఎస్ రజతోత్సవ సభగా ప్రకటించామని, కానీ ప్రజలు దీన్ని కాంగ్రెస్ పార్టీ పాలనపై వ్యతిరేకతగా చూస్తున్నారని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సభ పార్టీ…
అధికారం కోల్పోయాక అక్కడ గులాబీ దళంలో వర్గ పోరుకు బీజం పడిందట. పార్టీలోని రెండు వర్గాలు పరస్పరం ఆకర్ష మంత్రం జపిస్తుండటం కేడర్ను ఇరకాటంలో పెడుతోందట. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టే టార్గెట్గా పావులు కదుపుతున్న ఆ ఇద్దరు నాయకులు ఎవరు? ఏ నియోజకవర్గ టిక్కెట్ కోసం ఇప్పట్నుంచే స్కెచ్లేస్తున్నారు? ఉమ్మడి పాలమూరు జిల్లా షాద్నగర్ గులాబీ నేతల తీరుపై ఇప్పుడు పార్టీలో హాట్ హాట్ చర్చ జరుగుతోందట. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా, ఎలా ఉన్నా…
MLC Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఓరుగల్లులోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ ఆమె ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆమె ఎల్కతుర్తి లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆపై మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ.. తెలంగాణ ఉనికిని కోల్పోతున్న సమయంలో కేసీఆర్ పిడికిలి బిగించి తెలంగాణ ఉద్యమంతో అందరినీ…
బీఆర్ఎస్ అధిష్టానం దేన్నుంచో తప్పించుకోబోయి… ఇంకెక్కడో ఇరుక్కుపోయిందా? హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక పార్టీని ఇరికించేసిందా? ఇప్పుడు గులాబీ పార్టీకి కొత్తగా వచ్చిన ఇబ్బంది ఏంటి? దాని గురించి అంతర్గతంగా జరుగుతున్న చర్చ ఏంటి? హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ముగిసినా… పొలిటికల్ ప్రకంపనలు మాత్రం రేగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ ఎలక్షన్లో బీఆర్ఎస్ వైఖరి చర్చనీయాంశమైంది. ఈ ఎన్నికలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లే ప్రధాన ఓటర్లు. ఇప్పటివరకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఈ స్థానం నుంచి…
టీఆర్ఎస్ కి ఒక విశిష్టత ఉంది.. 25 ఏళ్లు పూర్తి చేసుకున్న పార్టీలు రెండు మాత్రమే ఉన్నాయి.. ఇక, తెలంగాణ ప్రజల గొంతుగా పార్టీ పేరు తెచ్చుకుంది టీఆర్ఎస్.. ప్రజలు ఏ బాధ్యత ఇచ్చిన దాన్ని ప్రజల ఆకాంక్షల మేరకు పని చేస్తున్న పార్టీ అని కేటీఆర్ పేర్కొన్నారు.
నేడు హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 25న కౌంటింగ్ నిర్వహిస్తారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే పోలింగ్, కౌంటింగ్ సాగనుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. ఒకటి కార్పొరేటర్లకు, మరొకటి ఎక్స్ ఆఫీసీయో సభ్యులకు వేర్వేరుగా ఏర్పాటు చేశారు.
KTR : లగచర్ల ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. గిరిజనుల పట్ల జరిగిన అన్యాయాన్ని, పోలీసుల ప్రవర్తనను, రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆయన తీవ్రంగా విమర్శించారు. లగచర్ల గ్రామస్తుల హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాడుతుందంటూ ఢంకా మోగించారు. బీఆర్ఎస్ బహిరంగ సభ కోసం లగచర్ల గిరిజన ఆడబిడ్డలు స్వచ్ఛందంగా లక్ష రూపాయలు విరాళంగా అందించారు. ఇది రాజకీయ సభలకు సాధారణంగా లభించే విరాళం కాదు, వారి ఆత్మబలమైన సంకేతం. “బీఆర్ఎస్ లాంటి పార్టీ…