బీఆర్ఎస్ పని అయిపోయింది.. మళ్ళీ మాదే అధికారం, రాబోయే ఎన్నికల్లో 90 నుంచి 100 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు.. ఇన్ డైరెక్ట్ గా బీజేపీకి మద్దతిచ్చి బీఆర్ఎస్ ఆత్మహత్య చేసుకుంది అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ అనేది ఉండదని మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కు సర్వం సిద్ధమైంది. రేపు జీహెచ్ఎంసీలో హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. రేపు జరిగే ఎన్నికకు ఏప్రిల్ 25న కౌంటింగ్ చేసి ఫలితాల ప్రకటిస్తారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ట్రెండింగ్ పొలిటీషియన్ ఆయన. గతంలో రెండు సార్లు మెదక్ ఎంపీగా చేసినప్పుడు అసలు ఉన్నారా లేరా అన్నట్టు ఉండేవారు. పార్టీ అధికారంలో ఉన్నా ఎక్కడా వివాదాల జోలికి వెళ్లేవారు కాదు.
తెలంగాణలో మున్సిపాలిటీ పాలకమండళ్ళ పదవీకాలం ముగిసి చాలా రోజులైంది. వాటికి ఇప్పటివరకు ఎన్నికలు జరగలేదు. ఎప్పుడు జరుగుతాయన్న క్లారిటీ లేదు. కానీ... ఇంకా పది నెలల దాకా పదవీకాలం ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల గురించి మాట్లాడుతోంది బీఆర్ఎస్. కమాన్... మీరు రెడీ అవండి. మళ్ళీ మీకే టిక్కెట్లు ఇస్తామని గులాబీ పెద్దలు అనడం ఆశ్చర్యంగా ఉందని ఆ పార్టీలోనే చర్చ జరుగుతోందట.
తెలంగాణ గొంతుక కాదు.. గొంతు కోసిన పార్టీ బీఆర్ఎస్ అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ అర్జెంట్‌గా సీఎం ఎందుకు అవ్వాలో కేటీఆర్ చెప్పాలన్నారు. బీఆర్ఎస్ వద్దనే కదా ప్రజలు ఇంటికి పంపిందని, ప్రభుత్వం మీద విష ప్రచారం ఎందుకు? అని ప్రశ్నించారు. తుపాకీ రాముడు, అగ్గిపెట్టె హరీష్, లిక్కర్ కవిత తప్పితే.. పార్టీ పెట్టినప్పుడు ఉన్నోళ్లు ఇప్పుడు ఎవరు ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకే రాని కేసీఆర్‌ను…
హైదరాబాద్ నగరంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు పోటీ చేయకుండా మజ్లిస్‌కు అండగా నిలబడుతున్నాయని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికైన కార్పొరేటర్లను ఓటు వేయకుండా బీఆర్ఎస్ బెదిరుస్తుందన్నారు. అత్యధిక ఓట్లు ఉన్నా ఏ ప్రాతిపదికన పోటీ చేయడం లేదో చెప్పాలన్నారు. పచ్చి మతోన్మాద, రజాకారు మజ్లిస్‌కు సపోర్ట్ చేస్తున్న ఈ రెండు పార్టీలు సెక్యులర్ పార్టీలు ఎలా అవుతాయని ప్రశ్నించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో హైదారాబాద్…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పోలీసు స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టివేసింది. గతేడాది సెప్టెంబర్‌లో కేటీఆర్‌పై ఉట్నూరు పీఎస్‌లో కేసు నమోదైంది. కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు అయింది. మూసీ ప్రక్షాళణ పేరుతో ప్రభుత్వం 25 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కేటీఅర్ చేసిన ఆరోపణలు తమ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీశారంటూ కాంగ్రెస్…
Konda Vishweshwar Reddy : హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ రాజకీయ విమర్శలు ముదురుతున్నాయి. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి AIMIM, కాంగ్రెస్, BRS పార్టీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. BBP అనే కొత్త పదాన్ని విపక్షాలకు ఆయన బిరుదుగా ఉపయోగించారు. BBP అంటే భాయ్ భాయ్ కే పార్టీ, బాప్ బేటే కే పార్టీ, బాప్ భేటి కి పార్టీ అని వ్యాఖ్యానించారు. ఇవన్నీ AIMIM, కాంగ్రెస్, BRSలకే సూచిస్తాయని ఎద్దేవా చేశారు.…
ఆరోగ్య సమస్యల వల్ల తాను దుబాయ్ వెళ్లానని, కార్యకర్తలకు దూరమయ్యానని బీఆర్ఎస్ నేత, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టొద్దని సీపీకి విన్నపం చేశానన్నారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తన కొడుకుపై కక్ష సాధింపులో భాగంగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 27న వరంగల్‌లో బీఅర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ జరగనుంది. రజతోత్సవ సన్నాహాక సమావేశ కార్యక్రమం బోధన్ అప్న ఫంకషన్‌లో…
త్వరలో జరిగే రాజేంద్రనగర్ ఉప ఎన్నికల్లో కార్తిక్ రెడ్డి గెలిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత నష్టపోయింది కేసీఆర్, బీఆర్ఎస్ కాదని.. ప్రజలే అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మాయమాటలకు ముసలోళ్లు, మహిళలు, నిరుద్యోగులు మోసపోయారన్నారు. మతం పేరు ఎత్తకుండా ఓటు అడిగే దమ్ము బీజేపీకి ఉందా? అని, బీజేపీ ఆటలు కూడా ఎన్నో రోజులు సాగవని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో రాజేంద్రనగర్ నేతలు బీఆర్ఎస్లో…