Off The Record: బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీ కవిత అంటే గిట్టని వాళ్ళు ఉన్నారా? పార్టీలో ఆమె మీద కుట్రలు జరుగుతున్నాయా? స్వయానా… కేసీఆర్ కుమార్తె మీద కుట్రలు, దుష్ప్రచారాలు చేసేంత దమ్ము బీఆర్‌ఎస్‌లో ఎవరికుంది? వాళ్ళెవరో కవితకు ఆల్రెడీ తెలిసిపోయిందా? పార్టీ వాళ్ళయినా సరే… తీవ్ర చర్యలన్న పదం ఆమె నోటి నుంచి ఎందుకు వచ్చింది? గులాబీ దళంలో అసలేం జరుగుతోంది?
Read Also: Off The Record: కేతిరెడ్డికి ఇప్పట్లో తాడిపత్రిలోకి ఎంట్రీ లేనట్టేనా..?
తెలంగాణలో రాజకీయ అగ్గి ఈసారి డిఫరెంట్‌గా రాజుకోబోతోందా అంటే… అవును… అలాగే కనిపిస్తోందని చెబుతున్నారు పొలిటికల్ పరిశీలకులు. బీఆర్‌ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం అంటున్నారు. తాజాగా మీడియాతో కవిత అన్న మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. సామాజిక తెలంగాణ విషయమై ఈనెల మొదట్లో కవిత అన్న మాటల సెగలే ఇప్పటికీ తగ్గలేదు. దాని మీద చర్చ జరుగుతుండగానే… మరోసారి బాంబు పేల్చారామె. గడిచిన పదేళ్ళలో సామాజిక తెలంగాణ పరిపూర్ణంగా రాలేదని, ప్రజల జీవన ప్రమాణాలు ఇంకా పెరగాల్సి ఉందని అప్పుడు అన్నారామె. తాను 47 నియోజకవర్గాల్లో పర్యటించానని, దాన్నిబట్టే చెబుతున్నానని అన్నారు కవిత. ఆ పదేళ్ళు అధికారంలో ఉంది బీఆర్‌ఎస్సే కదా…. అయినా, ఆమె అలా ఎందుకు అన్నారంటూ గడిచిన పది రోజులుగా ఇంటా బయటా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో తాజాగా కవిత అన్న మాటలు కాక పెంచాయి. బీఆర్‌ఎస్ మీద తెలంగాణ ప్రజల్లో రోజురోజుకూ నమ్మకం పెరుగుతోందని ఓ వైపు చెబుతూనే… జైలు జీవితం ప్రస్తావన తీసుకువచ్చారు కవిత. సోషల్ మీడియాలో తనను ఇష్టానుసారం ట్రోలింగ్ చేస్తున్నారని, ఆరు నెలలు జైల్లో ఉండి వచ్చాను…. ఇంకెంత కష్టపెడతారు నన్ను అంటూ భావోద్వేగానికి గురయ్యారామె. తన మీద దుష్ప్రచారం సరికాదన్నారు.
Read Also: Off The Record: తల ఉండి మొండెం లేనట్టుగా టీపీసీసీ
అయితే, తాను ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో నెగెటివ్‌గా ప్రచారం చేస్తున్నారని, దాన్ని ఆపాల్సిన బాధ్యత పార్టీగా బీఆర్‌ఎస్ మీద కూడా ఉందని అన్నారు కవిత. ఆ విషయమై త్వరలోనే పార్టీ అధికారికంగా ఫిర్యాదు చేస్తుందని ఆశిస్తున్నానని, ఒకవేళ అలా చేయకుంటే.. తానే వ్యక్తిగతంగా వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. తనను అస్సలు రెచ్చగొట్టొద్దని, ఒకవేళ రెచ్చగొడితే గనక ఇక నుంచి రియాక్షన్ కూడా గట్టిగానే ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత. తన మీద దుష్ప్రచారం చేస్తున్నవాళ్ళు ఎవరో తెలుసని, వాళ్ళ పేర్లు త్వరలోనే బయట పెడతానంటూ గట్టిగా రియాక్ట్ అయ్యారు ఎమ్మెల్సీ. అలా దుష్ప్రచారం చేసే బ్యాచ్ మా పార్టీలోనూ ఉండవచ్చు, వేరే పార్టీ కూడా ఉండవచ్చంటూ కొత్త అనుమానాలకు తెర తీశారు. వాళ్లు సొంత పార్టీ వాళ్ళైనా, బయటి వాళ్లైనా చర్యలు మాత్రం తీవ్రస్థాయిలో ఉంటాయంటూ స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారామె. ఒక ఆడపిల్లని ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నారు అది వాళ్లకు న్యాయమేనా అంటూ ఆవేదనగా ప్రశ్నించారు. అంత ఇబ్బంది పెడుతోందని ఎవరని అడిగితే.. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుల్లాగా మీరే తెలుసుకోండంటూ. విలేకరుల కోర్ట్‌లోకే బంతిని విసిరేశారామె. ఆ సంగతి ఎలా ఉన్నా.. ఆమె పేల్చిన బాంబు చుట్టూనే కొత్త చర్చ మొదలైంది.
Read Also: Off The Record: పోగొట్టుకున్న చోటే సాధించే పనిలో గులాబీ దళం
కాగా, బయట సంగతి సరే.. కవితను ఇబ్బంది పెట్టేవాళ్ళు బీఆర్‌ఎస్‌లో కూడా ఉన్నారా? సొంత పార్టీ వాళ్ళయినా సరే.. అన్న మాటని ఆమె ఎందుకు వాడతారని ప్రశ్నిస్తున్నారు పొలిటికల్ పండిట్స్. అసలు గులాబీ పార్టీలో కేసీఆర్ కుమార్తెను ఇబ్బంది పెట్టేంత దమ్ము, ధైర్యం ఎవరికి ఉన్నాయి? ఆ అవసరం ఎవరికుందని మాట్లాడుకుంటున్నాయి రాజకీయవర్గాలు. పార్టీ టాప్ ఫోర్‌లో ఉండే కవితను ఇబ్బందులు పెట్టేంత సీన్ ఎవరికి ఉందంటూ కేడర్, ద్వితీయ శ్రేణి నాయకులు సైతం ఆరాలు తీసేస్తూ.. ఎవరికి నచ్చిన విశ్లేషణలు వాళ్ళు చేసేస్తున్నారు. టైం వచ్చినప్పుడు వాళ్ళ పేర్లను తానే బయటపెడతానని ఆమె అన్నారు కాబట్టి.. ఈపాటికే ఎమ్మెల్సీకి ఫుల్ క్లారిటీ వచ్చి ఉంటుందని, ఆమె ఎవరెవరి పేర్లు, ఎప్పుడు బయటపెడతారోనని ఉత్కంఠగా చూస్తున్నారు తెలంగాణ రాజకీయ పరిశీలకులు. ఇక సోషల్ మీడియా ట్రోలింగ్స్‌పై పార్టీగా బీఆర్‌ఎస్ ఫిర్యాదు చేయకుంటే… వ్యక్తిగతంగా చేస్తానని ఎందుకు అన్నారు? అంటే.. పార్టీ మీద ఆమెకు నమ్మకం లేదా అన్నది మరో క్వశ్చన్. ఇలా ఒకదానికొకదాన్ని లింక్ చేసి చూసుకుంటూ రకరకాల విశ్లేషణల్లో మునిగితేలుతున్నాయి తెలంగాణ రాజకీయ వర్గాలు.