Aadi Srinivas : అభివృద్ధిని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయి.. అందుకే..
- రాజన్న ఆలయానికి రూ.150 కోట్లతో అభివృద్ధి ప్రణాళిక
- బంద్ రాజకీయాలకు భక్తుల అభిమానం అడ్డుపడదు
- పూజా విధులు యథావిధిగా, మండప విస్తరణే లక్ష్యం: ఆది శ్రీనివాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aadi Srinivas : ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ పట్టణంలో ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ముందుకొస్తే, కొన్ని రాజకీయ పార్టీలు మళ్లీ అడ్డుపడుతున్నాయన్న ఆరోపణలతో రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.76 కోట్లు మంజూరయ్యాయని, ఇది పట్టణానికి , ఆలయానికి మరింత ఆకర్షణను తీసుకురావడమే కాక, భక్తులకు మరిన్ని సౌకర్యాలను కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని శ్రీనివాస్ తెలిపారు.
బీజేపీ , బీఆర్ఎస్ పార్టీలు అభివృద్ధిని జీర్ణించుకోలేక బంద్‌కు పిలుపునిచ్చాయని మండిపడ్డారు. గతంలో ప్రభుత్వంలో ఉన్నా ఒక్క రూపాయి కూడా కేటాయించని బీఆర్ఎస్ నేత కేసీఆర్, కేంద్రంలో మూడు సార్లు అధికారంలోకి వచ్చి ఏ మద్దతు చూపని బీజేపీ నేతలు ఇప్పుడు అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటే బాధాకరమని అన్నారు. పుణ్యక్షేత్ర అభివృద్ధిలో భాగంగా ఆలయంలో జరిగే అన్ని నిత్య పూజలు యథావిధిగా జరుగుతాయని పదేపదే చెబుతున్నామని పేర్కొన్నారు. దేవాలయం తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయని, భక్తుల సేవలలో అంతరాయం కలుగకుండా మండప విస్తరణ పనులు చేపడుతున్నామని వివరించారు.
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
శృంగేరి పీఠాధిపతుల సలహాల మేరకు మార్గనిర్దేశనతో భీమేశ్వరాలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నామని, ఇది రాజన్నకు భక్తి లోపించకుండా చేయడానికే అని స్పష్టీకరించారు. మహా మండపాన్ని తొలగిస్తామని ఎవరూ చెప్పలేదని, అలాంటి మార్పులకు మేము కూడా వ్యతిరేకమేనని శ్రీనివాస్ స్పష్టం చేశారు. 2024-25 బడ్జెట్‌లో రూ.50 కోట్లు, 2025-26లో మరో రూ.100 కోట్లు కేటాయించి మొత్తం రూ.150 కోట్లతో ఆలయ , పట్టణ అభివృద్ధిని VTDA ద్వారా చేపట్టనున్నామని చెప్పారు.
“ఇది ఎవరి ఇల్లు కాదు. ఇది దక్షిణ కాశీగా పేరుగాంచిన పరమశివుని నిలయం,” అని ఆయన వ్యాఖ్యానించారు. అభివృద్ధిని స్వాగతించకుండా అడ్డుపడడం అనేది రాజకీయాలకు మాత్రమే సంబంధించిన చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ప్రతి విషయాన్నీ భక్తుల కోణంలో పరిగణిస్తూ ముందడుగు వేస్తుందనీ, రాజకీయాలు పక్కనపెట్టి అందరూ కలిసికట్టుగా ఆలయాభివృద్ధికి సహకరించాలని ప్రభుత్వ విప్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
Cyberabad Police: ఆదమరిస్తే అంతే సంగతులు.. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
తాజావార్తలు
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!