ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ ప్రజా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ కలిసి తెలంగాణలో పోటీ చేయబోతున్నాయని బాంబ్ పేల్చారు. ముగ్గురు కలిసి ఎన్ని కుట్రలు చేసినా ప్రజా ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుందన్నారు. కెసిఆర్ కు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పారు. Also…
NVSS Prabhakar : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. కాంగ్రెస్ , బీఆర్ఎస్ మధ్య ఓ రహస్య రాజకీయ డీల్ కుదిరిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనానికి గ్రౌండ్ వర్క్ మొదలైపోయిందని, ఇప్పటికే రెండుపార్టీల కీలక నేతల మధ్య రాజీ కుదిరిందని అన్నారు. ఈ డీల్లో భాగంగానే కాలేశ్వరం అవినీతి, విద్యుత్ కొనుగోళ్ల స్కామ్, ఫోన్ ట్యాపింగ్ వంటి కీలక అంశాలపై…
తెలంగాణలో ముక్కోణపు రాజకీయం యమా హాట్ హాట్గా మారుతోంది. అదీకూడా.. ఏడాదిన్నర క్రితం వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కేంద్రంగా జరుగుతుండటం ఉత్కంఠను పెంచుతోంది. మొన్నటిదాకా గులాబీ పార్టీని బీజేపీకి బీ టీమ్ అని కాంగ్రెస్ అంటే.. ఆ రెండు పార్టీలు ఒక్కటేనంటూ కాషాయ దళం కౌంటర్స్ వేసింది.
KTR: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, మాజీ మంత్రి, సిద్ధిపేట్ ఎమ్మెల్యే హరీశ్ రావు నివాసానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా దాదాపు రెండు గంటల పాటు హరీష్ రావుతో సమావేశం అయినట్లు తెలుస్తుంది.
KTR: వరంగల్లో గురువారం మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. మంత్రులు డబ్బులు తీసిన తర్వాతే ఫైళ్లపై సంతకాలు పెడతారని ఆమె చెప్పిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా శుక్రవారం స్పందించారు. కొండా సురేఖ మాట్లాడిన కొన్ని నిజాలకు అభినందనలు అని, తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ “కమీషన్ సర్కార్” నడుస్తోందని విమర్శించారు. 30 శాతం…
తెలంగాణ ఉద్యమ సమయంలోను, ఆ తర్వాత అధికారంలో ఉన్న పదేళ్ళు తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది బీఆర్ఎస్. కానీ... 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత డీలా పడ్డాయి పార్టీ శ్రేణులు. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో పాటు... తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. చాలామంది నాయకులు ఒక్కరొక్కరుగా పార్టీని వదిలేసి వెళ్లారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో అలాంటి వలసలు ఉక్కిరిబిక్కిరి చేసినా... ఈ మధ్య కాలంలో ఆ…
ట్రబుల్ షూటర్.... ఈ మాట వినగానే..... కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా ఠక్కున గుర్తుకు వచ్చే పేరు హరీష్రావు. ఉద్యమ సమయంలో... కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో చేరింది బీఆర్ఎస్. అప్పుడు ఎమ్మెల్యేగా కూడా లేని హరీష్రావుని మంత్రిని చేశారు కేసీఆర్. అలాగే హరీష్ కూడా మామకు నమ్మిన బంటు అనడంలో ఆశ్చర్యం లేదంటారు పొలిటికల్ పండిట్స్.
CM Revanth Reddy : తెలంగాణ సాధనకు ప్రాణంగా నిలిచిన నీళ్ల అవసరమే ఇప్పుడు ప్రజలకు నష్టంగా మారిందని, భావోద్వేగాన్ని రాజకీయంగా వాడుకున్న వారి తప్పిదాలే ఇందుకు కారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేవలం మూడు సంవత్సరాల్లో నిర్మాణం పూర్తయిన కాళేశ్వరం ప్రాజెక్టు అతి తక్కువ వ్యవధిలోనే విఫలమై, కుప్పకూలిన ఘటన భూ ప్రపంచంలో ఎక్కడా జరగలేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం నీటి కోసం మొదలై రాష్ట్రాన్ని సాధించిన ఆవేదనపై ఆయన…
Anugula Rakesh Reddy : తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, నాగర్ కర్నూల్ ప్రాంతాల్లో రోడ్డు పక్కన ఉన్న పేద ప్రజల షాపులను కూల్చివేయడం గమనార్హం. ఈ నిర్ణయంతో ఈ ప్రాంతాల పేదలకు చెందిన వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే ఈ చర్యకు సంబంధించిన వివిధ ప్రశ్నలు ప్రజల్లో , రాజకీయ వర్గాల్లో చర్చించబడుతున్నాయి. బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ..”అందగత్తెల కోసం పేదల షాపులను కూల్చడం ఏమిటి?” అని ప్రశ్నించారు. ఆయన అభిప్రాయానికి, అందగత్తెలతో రాష్ట్రానికి…
Aadi Srinivas : ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ పట్టణంలో ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ముందుకొస్తే, కొన్ని రాజకీయ పార్టీలు మళ్లీ అడ్డుపడుతున్నాయన్న ఆరోపణలతో రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.76 కోట్లు మంజూరయ్యాయని, ఇది పట్టణానికి , ఆలయానికి మరింత ఆకర్షణను తీసుకురావడమే కాక, భక్తులకు మరిన్ని సౌకర్యాలను కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని శ్రీనివాస్ తెలిపారు. బీజేపీ , బీఆర్ఎస్ పార్టీలు అభివృద్ధిని…