CM Revanth Reddy : కాళేశ్వరం కూలిన ప్రాజెక్టు కాదు.. గత పాలకుల అపరాధ చరిత్ర
- కాళేశ్వరం వైఫల్యంపై సీఎం రేవంత్ ఆగ్రహం
- సాయిల్ టెస్ట్ లేకుండానే నిర్మాణం
- విపత్తుకు గత ప్రభుత్వం బాధ్యమే : సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణ సాధనకు ప్రాణంగా నిలిచిన నీళ్ల అవసరమే ఇప్పుడు ప్రజలకు నష్టంగా మారిందని, భావోద్వేగాన్ని రాజకీయంగా వాడుకున్న వారి తప్పిదాలే ఇందుకు కారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేవలం మూడు సంవత్సరాల్లో నిర్మాణం పూర్తయిన కాళేశ్వరం ప్రాజెక్టు అతి తక్కువ వ్యవధిలోనే విఫలమై, కుప్పకూలిన ఘటన భూ ప్రపంచంలో ఎక్కడా జరగలేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం నీటి కోసం మొదలై రాష్ట్రాన్ని సాధించిన ఆవేదనపై ఆయన వివరంగా స్పందించారు. “తెలంగాణ ఉద్యమం ఒక భావోద్వేగం. అది ఉద్యోగాల కోసం కాదు. కానీ, కొన్ని రాజకీయ పార్టీలు ఆ భావోద్వేగాన్ని తమ లబ్దికోసం దుర్వినియోగం చేశాయి,” అని చెప్పారు. ఉద్యమంలో భాగంగా వచ్చిన ఆశయాలను నిర్వీర్యం చేస్తూ, ప్రభుత్వ పాలనను నిర్వాకం చేసిన విధానాలను ఆయన నిందించారు.
Rekha Gupta: కాల్పుల విరమణపై కేంద్రాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు
Also Read
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
- Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
- Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
- Pakistan: పాకిస్థాన్లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
కాళేశ్వరం నిర్మాణ పద్ధతిపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసిన సీఎం, “ప్రాజెక్టులు ఎలా కట్టకూడదో తెలుసుకోవాలంటే కాళేశ్వరం చూసి నేర్చుకోవాలి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల నిర్మాణానికి కనీస సాయిల్ టెస్ట్ కూడా చేయకుండానే పనులు ప్రారంభించడం ఘోర తప్పిదం,” అన్నారు. కేవలం 80 వేల పుస్తకాలు చదివినంత మాత్రానా ఇంజినీరింగ్ అనుభవం వచ్చినట్టు భావించి తీసుకున్న నిర్ణయాలే ఈ విపత్తుకు కారణమన్నారు. పూర్వ ప్రభుత్వం వందలాది కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కూడా పూర్తిచేయలేకపోయిన ప్రాజెక్టుల పరిస్థితిని గుర్తు చేస్తూ, గత పాలకులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. “ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు వర్షాలు, వరదలతో ఎంతటి సవాళ్లు ఎదుర్కొన్నా ఇప్పటికీ నిలబడగలుగుతున్నాయి. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం కట్టిన మూడు సంవత్సరాల్లోనే కూలిపోయింది. ఇది ప్రజాధనం మీద జరిగిన అతి పెద్ద అపరాధం,” అని మండిపడ్డారు.
Samantha : ఆ డైరెక్టర్ తో క్లోజ్ గా ఫొటో దిగిన సమంత..
అధికారుల వ్యవహారశైలిపై కూడా సీఎం రేవంత్ ఘాటుగా స్పందించారు. “నాయకుడు చెప్పినట్టు అధికారులు పని చేస్తే, తర్వాత ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుంది. అప్పటి సీఎం హెలికాప్టర్లో తిరుగుతూ ఎక్కడ ప్రాజెక్టు కట్టాలో నిర్ణయించిన తీరే ఈ రోజు పరిస్థితికి నిదర్శనం. విజిలెన్స్, NDSA నివేదికల ప్రకారం అధికారుల తప్పుడు నిర్ణయాలు వెలుగులోకి వచ్చాయి. తప్పు చేసిన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం” అన్నారు. ఉద్యోగ నియామకాల విషయంలోనూ ప్రభుత్వం కట్టుబడినదేనని స్పష్టం చేశారు. గ్రూప్ వన్ పరీక్షల ఏర్పాట్లు పూర్తయ్యాయని, అయితే కొందరి కోర్టు కేసుల వల్ల కొన్ని ఆలస్యాలు జరుగుతున్నాయని తెలిపారు. అయినప్పటికీ నియామక ప్రక్రియ త్వరలో పూర్తి చేస్తామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్నే!
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!